డీకే భూములను ఆన్‌లైన్‌ చేయండి

ABN , First Publish Date - 2022-09-20T02:35:31+05:30 IST

భూమి కొనుగోలు పథకం కింద 2006లో ఎస్సీ మహిళలకు పంపిణీ చేసిన డీకే పట్టా భూములను ఆన్‌లైన్‌ చేయాలని బొద్దికూరపాడు పంచాయతీ చింతలపాలెం ఎస్సీ మహిళలు స్పందన కార్యక్రమంలో సోమవారం తహసీల్దార్‌ రామ్మోహన్‌రావుకు వినతిపత్రం అందజేశారు.

డీకే భూములను ఆన్‌లైన్‌ చేయండి
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న చింతలపాలెం మహిళలు

తాళ్లూరు, సెప్టెంబర్‌ 19: భూమి కొనుగోలు పథకం కింద 2006లో ఎస్సీ మహిళలకు పంపిణీ చేసిన డీకే పట్టా భూములను ఆన్‌లైన్‌ చేయాలని బొద్దికూరపాడు పంచాయతీ చింతలపాలెం ఎస్సీ మహిళలు స్పందన కార్యక్రమంలో సోమవారం తహసీల్దార్‌ రామ్మోహన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. 2006లో గ్రామానికి చెందిన 8 మంది మహిళలకు భూమి కొనుగోలు పథకం కింద సర్వే నంబర్‌ 115/2లో  ఒకొక్కరికీ ఎకరా వంతున 8 ఎకరాలను పంపిణీ చేశారు. దాంతో అక్కడ సాగు చేసి జీవనం సాగిస్తున్నామన్నారు. ఆ భూములను ఆన్‌లైన్‌ చేయాలని అనేక మార్లు వీఆర్వోలకు విన్నవించినా చేయటం లేదన్నారు. సోమరప్పాడు గ్రామ పరిధిలోని భూములకు సర్వే నిర్వహించాలని ఇద్దరు అర్జీలు అందజేశారు.  


Read more