బీమాతో కార్యకర్త కుటుంబానికి ధీమా

ABN , First Publish Date - 2022-10-02T03:56:59+05:30 IST

తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసు కున్న ప్రతి ఒక్క కార్యకర్తకూ తెలుగుదేశం పార్టీ ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తుందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు.

బీమాతో కార్యకర్త కుటుంబానికి ధీమా

సభ్యత్వ నమోదులో మాజీ ఎమ్మెల్యే ఉగ్ర

పీసీపల్లి, అక్టోబరు 1 : తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసు కున్న ప్రతి ఒక్క కార్యకర్తకూ తెలుగుదేశం పార్టీ ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తుందని మాజీ ఎమ్మెల్యే,  టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. వ్యాపారరీత్యా గుంటూరు ఏటుకూరి రోడ్డులోని డీఎస్‌నగర్‌లో ఉంటున్న పీ సీపల్లి మండలం టీడీపీ నాయకులు, కార్యకర్తలకు శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.  ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ  కొత్త సభ్యత్వాలు పొందుతు న్నవారితో పాటు పాతవారు రెన్యువల్‌ చేయించుకోవాలని కో రారు. ప్ర మాదవశాత్తు జరిగే ఘటనలో కుటుంబాలు రోడ్డున పడ కుండా ఉండేలన్నదే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు ఉద్దేశమన్నారు. కార్యకర్తలు పార్టీ అండగా ఉండాలన్న లక్ష్యంతో బీమా సౌకర్యం కల్పించారన్నారు. పెద్ద ఎత్తున సభ్య త్వాలను నమోదు చేయించాలన్నారు. అక్టోబరు 2019 నాటికి డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరి చేత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓ టు కోసం దరఖాస్తు చేయించాలన్నారు. మోసపూరిత హామీ లతో గద్దెనెక్కిన జగన్‌కు గట్టి బుద్ధి చెప్పేలా ప్రజల్లో చైతన్యం నింపాలని శ్రేణులకు ఉగ్ర సూచించారు. కార్యక్రమంలో జి.నాగేశ్వరరావు, ఏనుగంటి వెంకయ్య, వెలిది కొండయ్య, ఏనుగంటి శ్రీను, రమణయ్య, సత్తిరెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.  


Read more