అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , First Publish Date - 2022-07-18T06:33:41+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన మూడేళ్ల కాలం లో పట్టణంలో చేపట్టిన అభి వృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కుందు రు నాగార్జునరెడ్డి అన్నారు.

అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

మార్కాపురం, జూలై 17: వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన మూడేళ్ల కాలం లో పట్టణంలో చేపట్టిన అభి వృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కుందు రు నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం పట్టణంలోని అభివృద్ధి పనులపై మున్సిపల్‌ కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జ్‌లు, అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ నెల 19 నుంచి 23 వరకూ పట్టణం లో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చిల్లంచెర్ల బాలమురళీకృష్ణ, వైస్‌చైర్మన్లు షేక్‌.ఇస్మాయిల్‌, చీతిరాజుపల్లి అంజమ్మ, కమిషనర్‌ గిరికుమార్‌, డీఈ సుబానీ, మేనేజర్‌ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం తర్లుబాడు మండల వాహన మిత్ర లబ్ధిదారులు ఎమ్మెల్యేను సన్మానించారు.

సింపుల్‌ ఏబీసీ పుస్తక ఆవిష్కరణ

పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు షేక్‌ మౌలాలీ తయారు చేసిన సింపుల్‌ ఏబీసీ పుస్తకాన్ని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ఆదివారం తన క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తర్లుపాడు ఎంపీపీ సూరెడ్డి సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు మండ్లా రామాంజనేయులు, అజయ్‌బాబు, వెలుగు ఏపీఎం రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యా వలంటీర్లను తిరిగి నియమించాలి

మార్కాపురం పురపాలక సంఘ పరిధిలోని 3 ఉన్నత పాఠశాలలు, 1 ప్రాథమికోన్నత పాఠశాల, 13 ప్రాథమిక పాఠశాలలో సుమారు 3340 మంది విద్యార్ధులు చదువుతున్నారని, కానీ ఉపాధ్యాయులు సరిపడా లేరని, గత ఏడాది మాదిరిగానే విద్యా వలంటీర్లను నియమించాలని యూటీఎఫ్‌ నాయకులు టి.సత్యనారాయణరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీరాములు తదితరులు ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2022-07-18T06:33:41+05:30 IST