టీడీపీ హయాంలోనే దళితవాడల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-07-18T06:32:21+05:30 IST

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో దళితవాడల్లో సీసీరోడ్లు, ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

టీడీపీ హయాంలోనే దళితవాడల అభివృద్ధి

నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం, జూలై 17 :  ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో దళితవాడల్లో సీసీరోడ్లు, ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని మొగుళ్లపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం బాదుడే, బాదుడు కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో  ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. పేదలకోసం ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లికానుక, దళిత విద్యార్ధులు ఉన్నత చదువులకోసం  అంబేద్కర్‌ విదేశీ ఓవర్‌సీస్‌ పథకాన్ని అమలుచేసినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అంబేడ్కర్‌ పేరు తొలగించారన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే రైతులకు 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రస్తుతం ఆ ఊసే మరిచారన్నారు. జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు మన్నె  రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోం దన్నారు.  కల్తీ మద్యం అమ్మించి పేద ప్రజల ప్రాణాలు తీస్తున్నారన్నారు.  వచ్చే ఎన్నికల్లో ప్రజలు మోసపోకుండా టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ చేకూరి ఆంజనేయులు, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు కామేపల్లి  వెంకటేశ్వర్లు, వడ్లమూడి లింగయ్య, మాజీ సర్పంచులు కంచర్ల సత్యనారాయణగౌడ్‌, ఎస్టీ సెల్‌ కార్యదర్శి మంత్రునాయక్‌, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, టీడీపీ నాయకులు వేగినాటి శ్రీనివాస్‌, తోట మహేష్‌, పయ్యావుల ప్రసాదు, జి కనకారావు,  కొత్త భాస్కర్‌, చేదూరి  లక్ష్మయ్య, షేక్‌ ఇస్మాయిల్‌, నాగరాజు వెంకటేశ్వర్లు, బిక్కి లింగయ్య,  బి. నాగేంద్రప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు

కంభం : విద్యుత్‌ చార్జీలు, ఆర్టీసీ బస్సు చార్జీలు, వంటగ్యాస్‌ ధరలు తగ్గించాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి కంభం 13వ వార్డులో నిర్వహించారు. ఈకార్యక్రమంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈకార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు తోట శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షులు మాధవమూర్తి, ముస్లిం మైనారిటీ కార్యదర్శి దాదా, గౌస్‌, మండల ప్రధాన కార్యదర్శి మల్లి, ఖాశిం, రవికుమార్‌, జిలాని పాల్గొన్నారు.

Read more