-
-
Home » Andhra Pradesh » Prakasam » Destruction no development-MRGS-AndhraPradesh
-
విధ్వంసమే.. అభివృద్ధి లేదు..
ABN , First Publish Date - 2022-03-17T04:33:04+05:30 IST
కల్లబొల్లి మాటలతో ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తూ విధ్వంసం చేస్తూ అభివృద్ధిని విస్మరించారని మండల టీడీపీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని చింతలపాలెం పంచాయతీ పరిధి మోట్రావులపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం గ్రామపార్టీ అఽధ్యక్షుడు కేతు విజయభాస్కర్‌రెడ్డి అధ్యక్షతన టీడీపీ గౌరవసభ నిర్వహించారు.

పామూరు, మార్చి 16: కల్లబొల్లి మాటలతో ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తూ విధ్వంసం చేస్తూ అభివృద్ధిని విస్మరించారని మండల టీడీపీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని చింతలపాలెం పంచాయతీ పరిధి మోట్రావులపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం గ్రామపార్టీ అఽధ్యక్షుడు కేతు విజయభాస్కర్‌రెడ్డి అధ్యక్షతన టీడీపీ గౌరవసభ నిర్వహించారు. సంక్షేమ పథకాల పేరు చెప్పకుంటూ గ్రామగ్రామాన తిరుగుతూ ప్రజల్ని మోసం చేయడం మినహా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఉగ్ర నరసింహారెడ్డిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటు పడాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీలు బొల్లా మాల్యాద్రి చౌదరి, ఎం. హుస్సేన్‌రావు యాదవ్, ఏ ప్రభాకర్ చౌదరి, డోలా శేషాద్రి, టీవీకే సుబ్బారావు, ఆర్‌ఆర్ రఫీ, దేవరపు మాల్యాద్రి, ఎం. రాహుల్ యాదవ్, శ్రీరామ్ నాగార్జున, గ్రామస్థులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.