శిలాఫలకం ధ్వంసం

ABN , First Publish Date - 2022-01-23T05:34:21+05:30 IST

కొరిశపాడు మండ లం బొడ్డువానిపాలెంలో ఈనెల 19న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ప్రారంభించిన కాపు కల్యాణ మండప శిలాఫలకాన్ని గ్రామానికి చెందిన పబ్బా అనిల్‌ అనే యువకుడు ధ్వంసం చేశాడు.

శిలాఫలకం ధ్వంసం
బొడ్డువానిపాలెంలో పగులగొట్టిన శిలాఫలకం

బొడ్డువానిపాలెంలో ఘటన

వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు 

మేదరమెట్ల, జనవరి 22: కొరిశపాడు మండ లం బొడ్డువానిపాలెంలో ఈనెల 19న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ప్రారంభించిన కాపు కల్యాణ మండప శిలాఫలకాన్ని గ్రామానికి చెందిన పబ్బా అనిల్‌ అనే యువకుడు ధ్వంసం చేశాడు. అనంతరం తానే ఈ చర్యకు పాల్పడి నట్లు ఘనంగా చెప్పుకున్నాడు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని ఏంచేసుకుంటారో చేసుకోండి, అసలు కల్యాణ మం డపం మొత్తం మూసివేయిస్తానని బెదిరింపులకు దిగాడు. ఈమేరకు గ్రామానికి చెందిన చింతం అంజయ్య, పబ్బా హనుమంతరావు, నేరెళ్ల శ్రీనివాసరావు, ప్రసన్న తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనిల్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 

శిలాఫలకం పగులగొట్టడం వెనుక వైసీపీ హస్తం

బొడ్డువానిపాలెంలోని రామాలయం పక్కన కాపు కల్యాణ మండపాన్ని నిర్మించారు. దాని ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఎమ్మెల్యే రవికుమార్‌ గత బుధవారం ఆవిష్కరించారు. ఆ సమయంలో వైసీపీకి చెందిన గ్రామ సర్పంచ్‌ నేరెళ్ల సుబ్బయ్య అడ్డుకోవడానికి ప్రయ త్నిం చారు. అక్కడ ఉన్న స్థానికులంతా ఎమ్మెల్యేకు మద్దతు పలికారు. వారందరి కోరిక మేరకు రవికుమార్‌ కల్యాణ మండపాన్ని ప్రారంభిం చారు. గతంలో కాపు కల్యాణ మండపం ని ర్మాణానికి అవసరమైన స్థలం కొనుగోలుకు ఎ మ్మెల్యే రూ.8 లక్షల మేర ఆర్థిక సహాయం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కల్యాణ మండపం నిర్మాణానికి రూ.18 లక్షలు మంజూరు చేయించారు. గతంలో ఇదే సర్పంచ్‌ కాపు కల్యాణ మండపం స్థలాన్ని కొనుగోలు చేయడానికి రవికుమార్‌ను కలిసిన వారిలో ఉ న్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి  శిలాఫలకం పగులగొట్టడం వెనుక వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రజల్లో చర్చనీయాంశమైంది. గతంలో కొరిశపాడు మండలంలో ఇటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు.

శిలాఫలకాన్ని నేనే వేయిస్తా

శిలాఫలకాన్ని పగుల గొట్టడం నాతప్పే, నేనే మరలా వేయిస్తాను అని పబ్బా అనిల్‌ స్థానిక పెద్దల వద్దకు వచ్చాడు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయవద్దని వారిని ప్రాథేయపడ్డాడు. ఆదివారం సాయంత్రం లోపు కొత్త శిలాఫలకాన్ని తయారు చేయించి యథాస్థానంలో పెడ తానని అనిల్‌ తమతో చెప్పాడని గ్రామస్థులు నేరెళ్ల శ్రీనివాసరావు, చింతం అంజయ్య తెలిపారు. 

Read more