-
-
Home » Andhra Pradesh » Prakasam » Dengue fever sheevar-NGTS-AndhraPradesh
-
డెంగ్యూ దడ
ABN , First Publish Date - 2022-09-10T06:24:43+05:30 IST
మండలంలోని పోలవరంలో డెంగ్యూ, విషజ్వరాలు విజృంభించాయి. గ్రామానికి చెందిన వలంటీరు నంబూరి యాకోబు (26), అందె కోటేశ్వరమ్మ (41) డెంగ్యూ బారిన పడి గురువారం రాత్రి మృతిచెందారు.

పోలవరంలో విజృంభించిన విషజ్వరాలులు
ఒకే రోజు ఇరువురు మృతి.. రెండువారాల క్రితం మరొకరు
ప్రతి ఇంటిలో జ్వరపీడితులే
500మందికిపైగా బాధితులు
పారిశుధ్యలోపమే కారణం
ముండ్లమూరు, సెప్టెంబరు 9 : మండలంలోని పోలవరంలో డెంగ్యూ, విషజ్వరాలు విజృంభించాయి. గ్రామానికి చెందిన వలంటీరు నంబూరి యాకోబు (26), అందె కోటేశ్వరమ్మ (41) డెంగ్యూ బారిన పడి గురువారం రాత్రి మృతిచెందారు. యాకోబు గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఎంతకీ తగ్గకపోవటంతో కుటుంబసభ్యులు మొదట అద్దంకి, తర్వాత ఒంగోలులోని ఆసుపత్రులకు తీసుకెళ్లగా డాక్టర్లు పరిశీలించి డెంగ్యూ జ్వరంగా నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన అందె కోటేశ్వరమ్మ గత కొన్నిరోజుల నుంచి థైరాయిడ్‌తో బాధపడు తోంది. నాలుగు రోజుల క్రితం విషజ్వరం సోకడంతో అద్దంకి లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ గు రువారం రాత్రి మృతిచెందారు. అదే గ్రామానికి చెందిన కుంచాల పద్మ కూడా 16రోజుల క్రితం విషజ్వరంతో బాధప డుతూ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా డెంగ్యూగా నిర్ధారించారు. ఆమె కూడా చికిత్సపొందుతూ మృతిచెందారు. దీంతో గ్రామస్థులు వణికిపోతున్నారు. జ్వరం లక్షణాలు కనిపిస్తే చాలు ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.
ఇంటిల్లిపాదికి జ్వరాలే
గ్రామం మొత్తంగా పదిరోజుల నుంచి విష జ్వరాలు సోకా యి. ప్రతి ఇంటిలో జ్వరపీడితులు ఉన్నారు. కొన్ని ఇళ్లలో అందరూ మంచం పట్టారు. గ్రామం మొత్తం మీద 500మం దికి పైగానే విషజ్వరాల బారినపడ్డారు. రోజుల తరబడి తగ్గ కపోవటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అద్దంకి, మేదర మెట్ల, ఒంగోలు, గుంటూరులలోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. అక్కడ బాధితులు చికిత్స కోసం వేలు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఇంత పెద్దమొత్తంలో జ్వరాలు ఒక చిన్న గ్రామంలో ప్రబలటానికి పారిశుధ్య లోపమే ప్రధాన కారణంగా తెలు స్తోంది. శుక్రవారం సాయంత్రానికి డీపీవో నారాయణరెడ్డి, డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి గ్రామానికి చేరుకుని సమీక్షించారు.
మంచం పట్టిన ఎస్సీకాలనీ
గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పెరికల ధనుంజయ, వెంకటసుబ్బులు, మహిమ, ప్రవీణ్, ప్రదీప్, అంజమ్మ, నాగమ్మ, కార్తీక్, సంధ్య, స్వాతిక్ గత వారంరోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ అద్దంకి, ఒంగోలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సపొందారు. ప్రైవేట్ ఆస్పత్రులకు డబ్బులు పెట్టలేక తిరిగి గురువారం సాయంత్రం ఇంటికి వచ్చి స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకుంటున్నారు. అదే కాలనీలో పులి వెంకటరావు, గురవమ్మ, శ్రీను, పులి వాసు, అయోధ్య, తిరుపతమ్మ, శ్రుతి, సింధు, పులి రమణ, ఆండ్ర తిరుపతయ్య, అంజలి, రుషితోపాటు మరి కొంతమంది జ్వరంతో బాధపడుతున్నారు. వీరిలో ఆండ్ర తిరుపతయ్య కుటుంబమంతా ఒంగోలులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. గ్రామానికి చెందిన రావూరి సైదమ్మ, కోటేశ్వరమ్మ, ముతికేపల్లి రమణలతో పాటు మరికొన్ని కుటుంబాలు విషజ్వరాలతో మంచం పట్టాయి. పట్టణాలకు పోవడానికి ఆర్థిక స్థోమత లేని వారు గ్రామంలోని ఆర్ఎంపీల వద్ద వైద్యం చేయించుకుంటున్నారు.