ఒక్క చాన్స్‌తో అధోగతి..!

ABN , First Publish Date - 2022-12-06T22:17:09+05:30 IST

ఒక్క చాన్స్‌ అంటూ వచ్చిన జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని టీ డీపీ మండలాధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు మాజీ జడ్పీటీసీ సభ్యుడు బొల్లా మాల్యాద్రిచౌదరి, హుస్సేన్‌ రావు యాదవ్‌ అన్నారు.

ఒక్క చాన్స్‌తో అధోగతి..!
‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో టీడీపీ నాయకులు

పామూరు, డిసెంబరు 6 : ఒక్క చాన్స్‌ అంటూ వచ్చిన జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని టీ డీపీ మండలాధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు మాజీ జడ్పీటీసీ సభ్యుడు బొల్లా మాల్యాద్రిచౌదరి, హుస్సేన్‌ రావు యాదవ్‌ అన్నారు. పామూరు మేజర్‌ పం చా యతీ పరిధిలోని వడ్డెపాలెం, కరెంట్‌ ఆఫీస్‌ కాలనీ ప్రాంతాల్లో 269 బూత్‌ ఇన్‌చార్జి పి.తిరుపతయ్య ఆ ధ్వర్యంలో మంగళవారం ఇదేం ఖర్మ రాష్ర్టానికి కా ర్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ అనుసరిస్తున్న విధానాలతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడు తున్నారన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్య మన్నారు. పేదలు ఆనందంగా ఉండాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. దళితులు, బీసీలు, మై నారిటీలను మోసం చేసిన జగన్‌ రెడ్డికి ప్రజలు చర మగీతం పాడా లని నాయకులు పిలుపునిచ్చారు. కా ర్యక్రమంలో ప్రభాకర్‌ అమీర్‌ బాబు, ప్రసాద్‌రెడ్డి, ఖాజా రహం తుల్లా, హరిబాబు, పాలపర్తి వెంక టేశ్వర్లు, రఫీ, గౌస్‌బాషా, జాజం వెంకటేశ్వర్లు డోలా శే షాద్రి, పులి నాయభ, సుబ్బారావు రమణయ్య మాల్యా ద్రి, కోటిరెడ్డి పందిటి హరీష్‌ పాల్గొన్నారు.

సీఎస్‌పురంలో...

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరు సంతోషంగా లేరని అందరూ కష్టాలలో ఉన్నా రని టీడీపీ మండల అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంగ య్య అన్నారు. మండలంలోని చింతలపాలెం, జంగం వారిపల్లి, చెర్లోపల్లి, ఏకునాంపురం గ్రామాలలో టీడీపీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ రాష్ర్టానికి’ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరిస్తూ గ్రామలలో ప్రదర్శన నిర్వహించారు. ఈ కా ర్యక్రమంలో నాయకులు షేక్‌.అబ్దుల్లా, ఎన్‌.సీ. మాలకొండయ్య, దేవెండ్ల తిరుపతయ్య, దాసరి మల్లికా ర్జున, పసుపులేటి గురుకృష్ణ, బి.వెంకటాద్రి, జి.లక్ష్మీదేవి, మాదినేని శ్రీనువాసులు, కోనంగి వెంకటకొండయ్య, మ హబూబ్‌బాషా, బి.వెంకటేశ్వర్లు ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దొనకొండలో..

దొనకొండ : మండలంలోని గంగదేవిపల్లి గ్రా మంలో టీడీపీ మాజీ లీగల్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు పరిటాల సురేష్‌ ఆధ్వర్యంలో మం గళవారం ఇందేం ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలపై వైసీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. టీడీపీ హ యాంలో మూడు లక్షల 70వేల వేలమంది బీసీలకు ఉపాధి చూపిస్తే వైసీపీ ఏం చేసిందన్నారు. రాష్ట్రంలో 56 కార్పొరేషన్లు పెట్టి ఒక్క దానికి కూడా నిధులు కే టాయించలే దన్నారు. ఇసుక మాఫియా, తాగునీటి సమస్య, అవి నీతి, కరెంట్‌ సమస్య, రోడ్ల సమస్య, నిధుల దుర్విని యోగం, నిల కడలేని పాలనతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు న్నారన్నారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. ఈ రాష్ర్టానికి దశదిశ చూపించే నాయకుడు చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అఖండ విజయాన్ని ఇవ్వాలని కోరారు. కా ర్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యక ర్తలు పాల్గొన్నారు.

నేడు మండలంలో..

ముండ్లమూరు : మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం మొదటగా తూర్పుకంభంపాడు, నూజెండ్లపల్లి, సుంకరవారిపాలెం, బట్లపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్నట్టు మండల టీడీపీ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలోని మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని కోరారు.

పీసీపల్లిలో..

పీసీపల్లి మండలంలోని భట్టుపల్లి గ్రామంలో బుధవారం ఇదేం ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమం నిర్వహి స్తున్నట్లు టీడీపీ మండలపార్టీ అధ్యక్షుడు వేమూరి రామయ్య తెలిపారు. కార్యక్రమానికి పార్టీ నాయ కులు, కార్యకర్తలు, గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొనా లని ఆయన కోరారు.

బీసీల ద్రోహి జగన్‌

కనిగిరి, డిసెంబరు 6 : బీసీల నిధులు దారి మళ్లించి బీ సీలకు జగన్‌రెడ్డి తీరని ద్రోహం చేశారని టీడీపీ బీసీ సె ల్‌ నాయకులు ఆరోపించారు. బీసీల అణచివేతే లక్ష్యంగా సాగుతున్న వైసీపీ పాలనకు నిరసనగా మంగళవారం ఇ దేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆర్డీవో కార్యా లయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీసీ నాయకులు నంబుల వెంకటేశ్వర్లుయాదవ్‌, శ్యామల చినవెంకటేశ్వర్లు యాదవ్‌, చింతలపూడి తిరుపాలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు పెద్ద పీట వేశారని గుర్తుచేశారు. జగన్‌రెడ్డి బీసీల ద్రోహి అని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు పడవలు ఇస్తే, వైసీపీ వాటిని రద్దు చేసిందన్నారు. అనంతరం ఆర్డీవో డీఏఓ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందచేశారు. నాయకులు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, బ్రహ్మంగౌడ్‌, నారాయణ, బ్రహ్మారెడ్డి, ఫిరోజ్‌, రిజ్వాన్‌, గోనా ప్రతాప్‌, సిద్ధాంతి బారాయిమాం పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T22:17:11+05:30 IST