దీక్ష విరమించిన జవాన్‌ కుటుంబసభ్యులు

ABN , First Publish Date - 2022-10-04T05:36:18+05:30 IST

నిందితులను అరెస్ట్‌ చేయాలని కోరుతూ ఆర్మీ జవాన్‌ కుటుంబసభ్యులు నాలుగు రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్షను సోమవారం విరమించారు.

దీక్ష విరమించిన జవాన్‌ కుటుంబసభ్యులు
నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న డీఎస్పీ శ్రీకాంత్‌

చినగంజాం, అక్టోబరు 3: నిందితులను అరెస్ట్‌ చేయాలని కోరుతూ ఆర్మీ జవాన్‌ కుటుంబసభ్యులు నాలుగు రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్షను సోమవారం విరమించారు. అక్కల సూర్యప్రకాష్‌ రెడ్డి మృతికి కారుకులైన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మూలగానివారి పాలెం గ్రామంలో గతనెల 30 నుంచి ఆర్మీ జవాన్‌ కుటుంబసభ్యులు నిరవధిక దీక్ష చేస్తున్నారు. శిబిరాన్ని చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్‌, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు సోమవారం సందర్శించి ఆర్మీ జవాన్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైసీపీ మండల మాజీ కన్వీనర్‌ కోట విజయ భాస్కరరెడ్డిని ఆదివారం అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు పంపి నట్లు ఎస్బీ సీఐ తెలిపారు. మిగిలిన నిందితులు కోట సౌజన్య, కోట రాంకుమార్‌రెడ్డి, కోట రామకృష్ణారెడ్డి, కోట మురళిధర్‌రెడ్డిలకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసినందున, వారిని అరెస్ట్‌ చేసే అధికారం లేదని తెలిపారు. 

ముందస్తు బెయిల్‌ తీసుకున్న వారి బెయిల్‌ను తిరస్కరించాలని కో రుతూ అప్పీల్‌కు వెళ్తామని కుటుంబసభ్యులకు తెలిపారు. నిందితు లకు కోర్టు వెంటనే బెయిల్‌ మంజూరు చేస్తే గ్రామంలో శాంతిభద్ర తలకు ఆటంకం కలుగుతుందని అధికారులకు ఆర్మీ జనాన్‌ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపారు. 

ఈ సంఘటనలపై విచారణ జరిపేందుకు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ డీసీఆర్బీ డీఎస్పీ లక్ష్మయ్యను నియమించినట్లు ఎస్బీ సీఐ తెలిపారు. విచారణాధికారి మంగళవారం గ్రామంలో విచారణ చేపడతారని, జరి గిన సంఘనలు ఆయనకు తెలియజేయాలని అన్నారు. విచారణ అధి కారి పది రోజులలో నివేదిక అందజేయగానే, ఉన్నతాధికారులతో చ ర్చించి ఇంకొల్లు సీఐపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 20 రోజుల్లో న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అఽధికా రులకు కుటుంబసభ్యులు తెలిపారు. అధికారులు ఇచ్చిన హామీలతో దీక్ష విరమిస్తున్నట్లు తెలిపారు. 

దీక్షలో  కూర్చున్న అక్కల సత్యనారాయణరెడ్డి, లక్ష్మీప్రసన్న, రాజు వెంకటేశ్వరరెడ్డి, రాజు సుబ్బలమ్మ, సోపర్ల లక్ష్మణ్‌రెడ్డి, పిట్టు వేణు గోపాల్‌రెడ్డి, వెంకటేశ్వమ్మకు చీరాల డీఎస్పీ, సీఐ నిమ్మరసం ఇచ్చి నిర వఽధిక దీక్షను విరమింపజేశారు. తదనంతరం చినగంజాం పీహెచ్‌సీ వైద్యాధికారి ఎస్‌.విజయభాస్కరరావు దీక్షలో కూర్చున్న వారికి వైద్య పరీక్ష్లలు నిర్వహించారు. బాధిత కుటంబానికి న్యాయం చేయాలని, నిందితులకు శిక్షించాలని మాజీ సర్పంచ్‌ వెంకటేశ్వరెడ్డి, మహిళలు అధికారులను కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఐ పి.నాగబాబు, ఎస్బీ ఎస్‌ఐ జి.శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-04T05:36:18+05:30 IST