చిన్నారి జోషిక మృతి

ABN , First Publish Date - 2022-11-23T00:39:11+05:30 IST

బ్రెయిన్‌ ట్యూమర్‌తో ఐదేళ్లుగా మృత్యువుతో పోరాటం సాగించిన కొండపికి చెందిన జోషిక (5) సోమవారం అర్ధరాత్రి తన స్వగృహంలో మరణించింది.

చిన్నారి జోషిక మృతి

మేలో రెండోసారి బ్రెయిన్‌ ట్యూమర్‌కు ఆపరేషన్‌

ఆంధ్రజ్యోతి వార్తతో ఆదుకున్న దాతలు ఫ అయినా దక్కని ప్రాణం

కొండపి, నవంబరు 22 : బ్రెయిన్‌ ట్యూమర్‌తో ఐదేళ్లుగా మృత్యువుతో పోరాటం సాగించిన కొండపికి చెందిన జోషిక (5) సోమవారం అర్ధరాత్రి తన స్వగృహంలో మరణించింది. కొండపిలోని జెండాచెట్టు సెంటర్‌లో నివాసం ఉండే బూదూ రి చంద్రశేఖర్‌, జ్యోత్స్నల ఏకైక కుమార్తె జోషిక పుట్టిన ఏడాదిలోపే తలలో పెరుగుతున్న గడ్డ బయటపడింది. ఆ పాప కు రెండేళ్ల వయస్సులో లక్షల రూపాయలు ఖర్చు చేసి చెన్నై లో తల్లిదండ్రులు శస్త్రచికిత్స చేయించారు. నాలుగేళ్లు దాటాక మరో శస్త్ర చికిత్స చేయాలని, చేసినా ఒక శాతం మాత్రమే బతికే అవకాశం ఉందని వైద్యులు అప్పుడే చెప్పారు. తల్లితండ్రులు ఆ చిన్నారిని కా పాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. సొంత డబ్బుతోపాటు ఆంధ్రజ్యోతి ద్వా రా కూడా దాతలను సంప్రదించారు. ప్రచురితమైన వార్తా కథనానికి అనేక మంది దాతలు స్పందించి సాయం అందించారు. ఆ డబ్బుతో జోషికకు వైద్యచికిత్స అందించారు. ఈ క్రమంలో జోషిక సోమవారం రాత్రి మరణించింది. దీంతో ఆ పాప తల్లితండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంత విషాదంలోనూ తండ్రి చంద్రశేఖర్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తన బిడ్డకు ఆర్థికసాయం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-11-23T00:39:11+05:30 IST

Read more