దెబ్బతిన్న కూరగాయల తోటలు

ABN , First Publish Date - 2022-12-30T00:11:21+05:30 IST

ఇటీవల కురిసిన వర్షాల ప్రభావం మా ర్టూరు పచ్చిమిర్చి కూరగాయలపై పడింది. ఈ ప్రాంతంలోని వివిధ గ్రామాలలో కురిసిన అకాల వర్షాల కారణంగా కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.

దెబ్బతిన్న కూరగాయల తోటలు

మార్టూరుకు ఇతర మార్కెట్‌ల నుంచి దిగుమతి

సగానికి త గ్గిన సరుకు.. పెరిగిన ధరలు

మార్టూరు, డిసెంబరు 29: ఇటీవల కురిసిన వర్షాల ప్రభావం మా ర్టూరు పచ్చిమిర్చి కూరగాయలపై పడింది. ఈ ప్రాంతంలోని వివిధ గ్రామాలలో కురిసిన అకాల వర్షాల కారణంగా కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. దాంతో స్థానికంగా కూరగాయల దిగుబడి రావడం లే దు. సాధారణంగా దోస, సొరకాయలతో పాటు ఆకుకూరలు మార్కెట్‌ కు వస్తున్నాయి. మిగిలిన కూరగాయలు కోసం కమీషన్‌ ఏజంట్లు ఇత ర ప్రాంతాలలోని కూరగాయల మార్కెట్‌లపై ఆధార పడుతున్నారు. దీంతో మార్కెట్‌ లో కూరగాయలకు డిమాండ్‌ పెరిగింది. సాధారణ స మయంలో కిలో రూ.10 నుంచి రూ.20 పలికే బెండ కాయలు ప్రస్తు తం కిలో రూ.40 పైమాటే. సొరకాయ రూ.2 నుంచి రూ. 3 ఉండే ధర నుంచి ఏకంగా రూ.10కి చేరుకున్నది. సీజనులో రోజుకు వెయ్యి బ స్తాలకు పైగా వచ్చే మార్కెట్‌లో ప్రస్తుతం సగం సరుకు కూడా రా వడం లేదంటే అతిశయోక్తి లేదు

ఇతర మార్కెట్‌ల నుంచి..

మార్టూరు పచ్చి మార్కెట్‌కు స్థానికంగా కూరగాయలు కొరతగా ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసు కుంటున్నారు. హైదరాబాదు, చిత్తూరు, కోలార్‌, మదనపల్లి, బెంగుళూ రు, ఆగ్రా, చెన్నై నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. హైదరాబాదు నుంచి మనకు స్థానికంగా లభించే వంకాయ, దొండ, మిర్చి, క్యారెట్‌లను, బెంగుళూరు నుంచి బీర, కాకర, క్యాబేజీలను ది గుమతి చేసుకుంటున్నారు. మదనపల్లి నుంచి టమోటాలు, ఆగ్రా నుం చి దుంపలను మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. ఈ కూరగాయలను క మీషన్‌ ఏజంట్లు మన రాష్ట్రంలోని విజయవాడ, నెల్లూరు, నరసరావు పేట, గుంటూరు, ఒంగోలు, రాజమండ్రి, తదితర మార్కెట్‌లకు వ్యాపా రుల ద్వారా అమ్ముతున్నారు.

కూరగాయలకు పెరిగిన డిమాండ్‌

గత 15 రోజుల నుండి మార్కెట్‌ లో కూరగాయలకు డిమాండ్‌ పెరి గింది. 10 కిలోలు ప్రకారం.. మిర్చి ధర రూ.200 నుంచి రూ.250, వం కాయలు రూ.350, బెండ రూ.400, గోరుచిక్కుళ్లు రూ.250, బీరకాయ లు రూ.400, కాకర రూ.250 పలుకుతున్నాయి. అలాగే, దుంపలు రూ. 220 నుంచి రూ.250, దొండకాయలు రూ.350 నుంచి రూ.400, టమో టా రూ.200, ములగ రూ.100 నుంచి రూ.150, క్యారెట్‌ రూ.200 పలు కుతున్నాయి. గ్రామాలలో చిల్లర వ్యాపారులు కిలో మిర్చి రూ.50లకు అమ్ముతున్నారు. మిగిలిన కూరగాయల ధరలు కూడా మరింతగా పెరిగిపోయాయి..

నాణ్యత లేకపోతే నష్టపోక తప్పదు!

- షేక్‌ మహమ్మద్‌ బుడే, కమీషన్‌ ఏజంట్‌, మార్టూరు

స్థానికంగా రైతులు పండించిన కూరగాయల నాణ్యతపై మాకు అవగాహన ఉంటుంది. ఇతర ప్రాంతాలనుంచి అత్యవర పరిస్థితులలో స్థానికంగా పండించే కూరగాయలను కూడా తీసుకురావలసిన పరిస్థి తి ఏర్పడింది. ఈ కూరగాయలు నాణ్యతగా లేకుంటే వాటిని వ్యాపారు లకు తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుంది. దాంతో కొన్ని కూరగాయల అమ్మకాలలో నష్టపోతున్నాం.

Updated Date - 2022-12-30T00:11:21+05:30 IST

Read more