దళిత మంత్రులపై చిన్నచూపు తగదు

ABN , First Publish Date - 2022-04-24T05:49:27+05:30 IST

ము ఖ్యమంత్రి జగన్‌ దళిత మంత్రులను చిన్నచూపు చూడటం తగదని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ నాయకులు ధ్వజమెత్తారు. శనివారం ఒంగోలు లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి నాళం నరసమ్మ మాట్లాడుతూ ముఖ్య మంత్రి గతంలో జిల్లాకు విచ్చేసినపుడు చేసిన హామీలలో ఒక్కదానిని అమలు చేయలేకపో యారని విమర్శించారు

దళిత మంత్రులపై చిన్నచూపు తగదు
సమావేశంలో మాట్లాడుతున్న నాళం నరసమ్మ

టీడీపీ ఎస్సీ సెల్‌ ధ్వజం


ఒంగోలు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 23 : ము ఖ్యమంత్రి జగన్‌ దళిత మంత్రులను చిన్నచూపు చూడటం తగదని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ నాయకులు ధ్వజమెత్తారు. శనివారం ఒంగోలు లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి నాళం నరసమ్మ మాట్లాడుతూ ముఖ్య మంత్రి గతంలో జిల్లాకు విచ్చేసినపుడు చేసిన హామీలలో ఒక్కదానిని అమలు చేయలేకపో యారని విమర్శించారు. వైసీపీలో దళితులకు స ముచిత స్థానం అంటూ ప్రకటించడం తప్ప, ఆ చరణలో అమలు కావడం లేదన్నారు. జిల్లాకు చెందిన పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఇన్‌చార్జి మంత్రి మేరువ నాగార్జునకు ఒ క నిమిషం కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపో వడం దళితులపై చిన్న చూపే అని ఆరోపించా రు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దళితుల ఓట్లుతో అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు వారిని పట్టించుకోకపోవడం అన్యాయమ న్నారు. దళితులకు పెద్దపీట వేసిన ఘనత చం ద్రబాబునాయుడుకే దక్కుతుందని చెప్పారు. మూడేళ్ళలో రాష్ట్రంలోని దళితులందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ దళితులే త్వర లోనే వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారని హె చ్చరించారు. సమావేశంలో తెలుగు యువత అ ధ్యక్షుడు ముత్తన శ్రీనివాసరావు, నగర ఎస్సీ సె ల్‌ అధ్యక్షులు నావూరి కుమార్‌, చుండి శ్యామ్‌, హగ్గయ్యరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Read more