ఉపాధి హామీ పనుల్లో అవినీతి

ABN , First Publish Date - 2022-11-15T22:50:32+05:30 IST

ఉపాధి పనులపై మంగళవారం ఉ పాధి కార్యాలయం వద్ద జరిగిన ప్రజావేదిక మొక్కుబడిగా సాగింది. 20 20-21, 2021-22 సంవత్సరానికి సంబంధించి మండలంలోని 20 పం చాయతీల్లో రూ.44 కోట్ల పై మేర పనులు జరగ్గా అందులో గ్రామాల్లో తనిఖీ నిర్వహించి గ్రామ సభలు నిర్వహించిన అనంతరం మండల సా ్థయిలో జరిగిన సామాజిక ప్రజా వేదికలో రూ.4,11,297 అక్రమాలకు పా ల్పడినట్టు పీడీ నివేదికల ద్వారా తెలిపారు.

ఉపాధి హామీ పనుల్లో అవినీతి
వివరాలు తెలియజేస్తున్న డ్వామా పీడీ శీనారెడ్డి

రూ.44 కోట్లతో పనులు

రూ.4,11,297 అక్రమాలు

రికవరీ చేస్తాం : డ్వామా పీడీ శీనారెడ్డి

ముండ్లమూరు, నవంబరు 15 : ఉపాధి పనులపై మంగళవారం ఉ పాధి కార్యాలయం వద్ద జరిగిన ప్రజావేదిక మొక్కుబడిగా సాగింది. 20 20-21, 2021-22 సంవత్సరానికి సంబంధించి మండలంలోని 20 పం చాయతీల్లో రూ.44 కోట్ల పై మేర పనులు జరగ్గా అందులో గ్రామాల్లో తనిఖీ నిర్వహించి గ్రామ సభలు నిర్వహించిన అనంతరం మండల సా ్థయిలో జరిగిన సామాజిక ప్రజా వేదికలో రూ.4,11,297 అక్రమాలకు పా ల్పడినట్టు పీడీ నివేదికల ద్వారా తెలిపారు. ఇందులో పంచాయతీకి సం బంధించి రూ 2,68,296 ఉపాధి ద్వారా రూ.1,43,001 గుర్తించటం జరిగిం దన్నారు. పులిపాడులోని పంచాయతీ రాజ్‌ ద్వారా జరిగిన పనుల్లో రూ.84 వేలు, పెద ఉల్లగల్లులో రూ.1,08,248, శంకరా పురంలో రూ.75,448, నూ జెండ్లపల్లిలో రూ.3,679, ఉమా మహేశ్వర అగ్రహారం రూ.3,322, సిం గనపాలెం రూ.6,446, భీమవరం రూ.4,683, నాయుడుపాలెం రూ.12,751, వేముల రూ.2,713, పోలవరం రూ.2,196, కెల్లంపల్లి రూ.38,081, పసుపు గల్లు రూ.3,516, పూరిమెట్ల రూ.1239, ఈదరలో రూ.8,191, ముండ్ల మూ రు రూ.9,070, శంకరాపురంలో రూ.25,696, పెద ఉల్లగల్లులో రూ.2,382, జమ్మలమడక రూ.10,090, పులిపాడులో రూ.8,527, మారెళ్లలో రూ.31, 480 అవినీతి జరిగినట్టు పీడీ తెలిపారు. నిధులను రాబెట్టడడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏపీవో కే కొండయ్య అధ్యక్షతనన జరిగిన సభలో మారెళ్లకు సంబంధించి గ్రామ సర్పంచ్‌ గోపనబోయిన వెంకటేశ్వరరావు గ్రామంలో జరిగిన పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, పనికి వెళ్లని వారికి కూడా హాజరు వేసి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నగదు పంచుకున్నారని ఆరోపించారు. గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ సభలో డీఆర్‌పీ ముందు పెట్టామని పీడీ దృష్టికి సర్పంచ్‌ తీసుకు వచ్చారు. ఏపీడీని విచారణ అధికారిగా నియమించామని, త్వర లోనే గ్రామానికి విచారణకు వస్తారని పీడీ అన్నారు. గ్రామానికి చెందిన గోపనబోయిన చిన శ్రీను తాను పనికి వెళ్లక పోయినా వెళ్లినట్టు కూలి వేశారని చెప్పగా, ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారని పీడీ ప్రశ్నించారు. ఆ డబ్బులను తిరిగి చెల్లించాలని పీడీ ఆదేశించారు. చిన్న శ్రీను మాత్రం తనకు వచ్చిన డబ్బులను తిరిగి చెల్లిస్తానని తెలిపారు. సమీక్ష జరుగు తుండగా ఎంపీటీసీ సభ్యుడు నాగమల్లి అంకమరావు మాట్లాడుతూ గ్రా మంలో లేని వారికి హాజరు వేశారని చెప్పారు.

ప్రజావేదిక నిర్వహణపై అనుమానాలు

20 పంచాయతీలపై 10 గంటలకు ప్రారంభమైన సభ మధ్యాహ్నం 2:30 గంటలకు ముగించి చేతులు దులుపుకున్నారు. ఏ పంచాయతీకి సంబంధించి కూడా సమగ్రంగా తనిఖీ చేసిన సందర్భాలు లేవు. రెండు సంవత్సరాల్లో రూ.44 కోట్లకు పైగా పనులు జరిగితే కేవలం డీఆర్‌పీలు ఇచ్చిన నివేదిక ఒకరంగా ఉంటే ఇక్కడ అవినీతి చేసిన సంగతి చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాగా ఉందని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు రూ.2వేలు నుంచి రూ.3వేలు మాత్రమే అక్రమాలకు పాల్పడినట్టు రాయడంతో దీని వెనుక పెద్ద ఎత్తున చేతులు మారినట్టు విమర్శలు వినవస్తున్నాయి. కార్యక్రమంలో ఎంపీడీవో కుసుమ కుమారి, ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు తాతపూడి మోషెస్‌ రత్నరాజు, గ్రామ విజిలెన్స్‌ అధికారి వెంకట స్వామి, మీరావలి, ఎస్‌ఆర్‌పీ మాధవరావు, ఏపీవో కే కొండయ్య, వెంకటరావు, డీఆర్‌పీలు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T22:50:34+05:30 IST