ప్రొటోకాల్‌ పాటించలేదని ఆందోళన

ABN , First Publish Date - 2022-11-30T00:11:28+05:30 IST

స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మంగళ వారం చైర్మన్‌ చిర్లంచెర్ల బాలమురళీకృష్ణ అధ్యక్షతన కౌన్సిల్‌ అత్యవసర సమావేశం జరిగింది.

ప్రొటోకాల్‌ పాటించలేదని ఆందోళన

మార్కాపురం(వన్‌టౌన్‌), నవంబరు 29: స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మంగళ వారం చైర్మన్‌ చిర్లంచెర్ల బాలమురళీకృష్ణ అధ్యక్షతన కౌన్సిల్‌ అత్యవసర సమావేశం జరిగింది. సాక్షాత్తు వైసీపీకి చెందిన 9వ వార్డు కౌన్సిలర్‌ మొఘల్‌ సిరాజ్‌తుల్లా బేగ్‌ మాట్లాడుతూ.. ప్రోటోకాల్‌పై ధ్వజమెత్తారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఛాంబర్‌లో మహిళా వైస్‌ చైర్మన్‌ సీట్లో ఆమె భర్త కూర్చొని పెత్తనం చెలాయించడం ఏ విధమైన ప్రోటోకాల్‌ అని ప్రశ్నించారు. ఆయన ఏమైనా కమిషనరా..? చైర్మనా..? అని నిలదీశాడు. దీనికి వెంటనే చైర్మన్‌, కమిషనర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో చైర్మన్‌ బాలమురళీ కృష్ణ జోక్యం చేసుకుంటూ ‘మనం అధికార పక్షం’ అని పేర్కొన్నారు. దీనిపై సిరాజ్‌తుల్లా స్పందిస్తూ దీనిపై అవసరమైతే న్యాయపరంగా కూడా ముందుకు పోనున్నట్లు పేర్కొన్నారు. ప్రొటోకాల్‌ ఉల్లంగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సమావేశంలో ఈ విషయంపై చర్యలు తీసుకోకుంటే చట్టప్రకారం ముందు కు వెళ్తామన్నారు. ఈ సమా వేశంలో కౌన్సిలర్లు మాట్లాడారు. సమావేశంలోని అజెండాలోని 33 అంశాలపై ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించడంపై కౌన్సిలర్లు పెదవి విరిచారు. టీడీపీ కౌన్సిలర్‌ ఏరువ వెంకట నారాయణ రెడ్డి మాట్లాడుతు పట్టణంలోని మున్సిపల్‌ పాఠశాలలను విద్యాశాఖకు అప్పజెప్పారన్నారు. అయితే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తుందన్నారు. వెంకటేశ్వర మున్సిపల్‌ పాఠశాలలో 360 మంది విద్యార్థులు ఉండగా ఆరుగురు మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నార న్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోవడం లేదన్నారు. 16వ వార్డు కౌన్సిలర్‌ హర్షితాబాబీ మాట్లాడుతు బాపూజీ కాలనీలో సచివాలయం వద్ద చిల్లచెట్లు పెరగడంతో అసాంఘిక కార్యాకలాపాలు జరుగుతున్నాయని జనాలు తిరగాలంటే భయపడుతున్నారన్నారు. క్రిస్మస్‌ ను పురస్కరించుకొని పట్టణంలోని అన్ని చర్చీల వద్ద వివిధ సౌకర్యాలు కల్పించాల న్నారు. మరో కౌన్సిలర్‌ కశ్శెట్టి నగేష్‌ మాట్లా డుతు పట్టణంలో పందులు పట్టివేస్తుంటే తిరిగి అధిక సంఖ్యలో పందులు ఎలా తిరుగుతున్నా యన్నారు. రెడ్డి మహిళా కళాశాల వద్ద మురుగు వేయరాదన్నారు. వైస్‌ చైర్మన్‌ ఇస్మాయిల్‌ మాట్లాడుతు బెస్త కాలనీలో మురుగు కాలువల నిర్మాణం పెంచాలన్నారు.

Updated Date - 2022-11-30T00:11:28+05:30 IST

Read more