పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ABN , First Publish Date - 2022-05-30T07:25:09+05:30 IST

పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో 2004-2007 బ్యాచ్‌ బిఎస్సీ (బిజడ్‌సి) పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది.

పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
వివేకానంద డిగ్రీ కళాశాల్లో సమావేశమైన పూర్వ విద్యార్థులు

పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

గిద్దలూరు, మే 29 : పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో 2004-2007 బ్యాచ్‌ బిఎస్సీ (బిజడ్‌సి) పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈసందర్భంగా కళాశాల కరస్పాండెంట్‌ అయిన మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పన, ప్రస్తుత ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పోలిరెడ్డి, అప్పటి లెక్చరర్లను పూర్వవిద్యార్థులు ఘనంగా సన్మానించారు. అప్పటి లెక్చరర్ల బోధన, క్రమశిక్షణ ఫలితంగానే పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలు పొందామని పలువురు పూర్వవిద్యార్థులు ఈసందర్భంగా పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన సీనియర్‌ అకౌంటెంట్‌ శ్రీనివాసరెడ్డి, మైలాన్‌ ల్యాబొరేటరి అసిస్టెంట్‌ మేనేజర్‌ ఆర్‌.నరసింహారెడ్డి, కెమిస్ట్రీ లెక్చరర్‌ ఆంజనేయులు, రీసెర్చ్‌ అసోసియేట్‌గా పని చేస్తున్న రంగస్వామిరెడ్డి, జువాలజి లెక్చరర్‌ హెలెన్‌, తదితర పూర్వ విద్యార్థులు అలనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

రాచర్ల : పాఠశాలలో చదువుకునే రోజుల్లో పూర్వవిద్యార్థులను గుర్తించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ గిల్డ్‌ కోశాధికారి షేక్‌ షెక్షావలి అన్నారు. పదోతరగతి 1997-98  పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా షెక్షావలి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విద్యను నేర్పించడం ద్వారా అనేక మంది ప్రయోజకులవుతున్నారన్నారు. పూర్వ విద్యార్థులను గుర్తించి వారి పేదరికాన్ని గుర్తించి ఆదుకుంటామన్నారు. అనంతరం గురువులను, తల్లిదండ్రులను సన్మానించారు.

Read more