-
-
Home » Andhra Pradesh » Prakasam » Collections in the name of Dussehra customs-MRGS-AndhraPradesh
-
దసరా మామూళ్ల పేరుతో వసూళ్లు
ABN , First Publish Date - 2022-09-11T05:12:57+05:30 IST
అద్దంకి ప్రాంతంలో దసరా వస్తుందంటే రోడ్లపై వెళ్ళే వాహన చోదకులు బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది.

బెంబేలెత్తుతున్న వాహనచోదకులు
అద్దంకి, సెప్టెంబరు 10: అద్దంకి ప్రాంతంలో దసరా వస్తుందంటే రోడ్లపై వెళ్ళే వాహన చోదకులు బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. బల్లికు రవ మండలంలోని రెండు మూడు గ్రామాల లోని ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చి అడ్డగోలు గా వసూలుకు పాల్పడుతున్నారు. ప్రధానంగా అద్దంకి సమీపంలోని ఆయా రోడ్ల వెంబడి మహిళలు గుంపులు గుంపులుగా వాహనాలకు అడ్డు వచ్చి నగదు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ద్విచక్ర వాహనాలు, కార్లకు అడ్డంగా వచ్చి వాహనాలను ఆపి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కనీసం రూ.వంద నుంచి రూ.500 వరకు డిమాండ్ చేస్తున్నట్తు తెలుస్తుంది. అకస్మాత్తుగా మహిళలు రోడ్డుపైకి వస్తుండ టంతో ద్విచక్ర వాహనచోదకులు కంగారుపడి ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. ఒక్కసారి గా ద్విచక్ర వాహనాన్ని చుట్టుముట్టుతుండటం తో వాహనచోదకులు ఉ క్కిరిబిక్కిరి అవుతున్నా రు. డబ్బులు ఇచ్చేదాకా కదలనివ్వకపోవటంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
శనివారం శింగరకొండ సమీపంలో భవనాసి చెరువు కట్ట వద్ద వాహనచోద కుల వద్ద మహిళల ముఠా వ సూళ్లు చేసింది. శింగరకొండకు వచ్చే భక్తులు కూడా వసూళ్ల దందాను చూసి బెంబేలెత్తిపో యారు. పోలీస్ అధికారులు స్పందించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న మహిళలను కట్టడి చేయాలని పలువురు వాహనచో దకులు కోరుతున్నారు.