కూలిన పాఠశాల ప్రహరీ గోడ
ABN , First Publish Date - 2022-12-13T22:44:55+05:30 IST
కనిగిరి ప్రాంతంలో నాన్పుడు వాన కురి సింది. దీంతో మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామ ప్రాథమిక ఉన్నత పా ఠశాల ప్రహరీగోడ మంగళవారం కూలిపోయింది.

కనిగిరి, డిసెంబరు 13 : కనిగిరి ప్రాంతంలో నాన్పుడు వాన కురి సింది. దీంతో మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామ ప్రాథమిక ఉన్నత పా ఠశాల ప్రహరీగోడ మంగళవారం కూలిపోయింది. గోడ కూలిన సమ యంలో విద్యార్థులు ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణాప్రాయం తప్పింది. నాడు నేడు పథకం కింద విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి నామమాత్రంగానే ఉన్నాయని చెప్పడానికి కూలిన గోడే నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నూతనంగా ప్రహరీ గోడతో పాటు తరగతి గదులను కూడా నాణ్యతతో నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Read more