సూరారెడ్డిపాలెం దళితవాడలో ఘర్షణ

ABN , First Publish Date - 2022-05-18T05:58:27+05:30 IST

మండలంలోని సూరారెడ్డిపాలెం దళితవాడలో రెండు కుటుంబాల మధ్య మంగళవారం ఘర్షణ చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తలకు గా యాలయ్యాయి.

సూరారెడ్డిపాలెం దళితవాడలో ఘర్షణ

ఒకరికి గాయాలు


టంగుటూరు, మే 13 : మండలంలోని సూరారెడ్డిపాలెం దళితవాడలో రెండు కుటుంబాల మధ్య మంగళవారం ఘర్షణ చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తలకు గా యాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. సూరారెడ్డిపాలెం దళితవాడకు చెందిన అత్యాల సురేష్‌, బాబూరావుల మధ్య కొంత కాలం నుంచి విభేదాలు కొనసాగుతు న్నాయి. వీరిలో సురేష్‌ స్థానిక ప్రాఽథమిక పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సురేష్‌కు, బాబూరావు సోదరుడితో గొడ వ జరిగింది. మంగళవారం ఉదయం సురేష్‌ తల్లి వేరే పనిమీద  బాబూరావు ఇంటి సమీపానికి వెళ్లింది. ఆమెతో బాబూరావు కుటుంబ సభ్యులు వాగ్వివాదానికి దిగారు. ఈసందర్భంగా వీరి మధ్య ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకొని సురేష్‌ అక్కడికి చేరుకోగా.. ఆయనపై బాబూరావు కుటుంబ సభ్యులు దాడి చేశారు. తలకు గాయాలై న సురేష్‌ను కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. జరిగిన సంఘటనపై బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై టంగుటూరు ఎస్సై బాషాని వివరణ కోరగా ఘర్షణ జరిగిన విషయం నిజ మేనని, సమాచారం కోసం తమ పోలీసులను రిమ్స్‌కు పంపించానన్నారు.


Read more