మిర్చి పంట వర్షార్పణం

ABN , First Publish Date - 2022-10-08T06:23:02+05:30 IST

మూడు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మిర్చిపంట భారీగా దెబ్బ తినడంతో మిర్చి రైతులు లబోదిబోమంటున్నారు.

మిర్చి పంట వర్షార్పణం
దెబ్బతిన్న పొలాలను పరిశీలిస్తున్న అధికారులు

తర్లుపాడు, అక్టోబరు 7: మూడు రోజుల నుంచి  కురిసిన భారీ వర్షాలకు ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మిర్చిపంట భారీగా దెబ్బ తినడంతో మిర్చి రైతులు లబోదిబోమంటున్నారు. మిర్చి తోటల్లో నీరు నిల్వ ఉండి ఉరకెత్తుతోంది. కొందరు రైతులు వర్షపు నీరును శుక్రవారం బయటకు వెళ ్లబెట్టుకున్నప్పటికీ సాయంత్రం ఆకస్మికంగా గంటపాటు భారీ వర్షం కురవడంతో మిర్చి తోటల్లోకి నీరు చేరింది. దీంతో మిర్చి తోటలు ఎందుకు పనికిరావంటూ రైతులు వాపోతున్నారు. ఎకరాకు ఇప్పటికే దాదాపుగా రూ.70 వేలు ఖర్చు చేయడంతో లక్షలాది రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు దుఃఖంలో మునుగుతున్నారు. దెబ్బతిన్న పంటలను వ్యవసాయాధి కారి చంద్రశేఖర్‌ శుక్రవారం పరిశీలించారు. ఇప్పటికే సుమారు 350 ఎకరాల్లో మిర్చిపంట పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. సాయంత్రం కురిసిన వర్షానికి ఎక్కు వ తోటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. మిర్చి తోటల్లో నీరును బయటకు పెట్టుకునేందుకు వ్యవ సాయాధికారి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ వాగు

మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు బొడిచర్ల వద్ద గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహి స్తోంది. శుక్రవారం సాయంత్రం కూడా ప్రవహించడంతో వివిధ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతు న్నారు. ఆయా గ్రామాలకు వెళ్లేందుకు వేరే మార్గాలు కూడా లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గుండ్లకమ్మ వాగు వద్ద ఎలాంటి వాహనాలు వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

అధ్వానంగా బస్టాండ్‌

ఎర్రగొండపాలెం : నియోజకవర్గ కేంద్రంలోని ఏపీఎస్‌  ఆర్టీసీ బస్టాండు ఆవరణలో మూడురోజలుగా కురుస్తున్న ముసురువానకు నీళ్లు నిలిచి బురదమయంగా మారింది. ప్రయాణికులు అడుగుతీసి, అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. బస్టాండు ఆవరణలో చిన్న చిన్న గుం తలు ఏర్పడి వర్షపు నీరు నిల్వ ఉండి ప్రయాణికులు బస్సు ఎక్కాలన్నా, దిగాలన్నా, బురదమట్టి జారి  వృద్ధు లు, పిల్లలు పడిపోతున్నారు. ప్రయాణికులు బస్టాండు ఆవరణలో ఉన్న సమయంలో బస్సు టైర్ల కింద చిందిన మట్టినీరు ప్రయాణికులపై పడి దుస్తులు మురికి అవుతున్నాయి. దసరా సెలవులకు ఊర్లకు వచ్చి  తిరిగి వెళ్లే ప్రయాణికులతో రద్ధీగా మారింది. ఇదే బస్టాండు  ఆవరణలో వర్షంలేని సమయంలో దుమ్ము కాలుష్యంతో వర్షం వస్తే  బురదమయం అవుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. బస్టాండు ఆవరణలో కాంక్రీటు వేసి ప్లాట్‌ఫాంలు శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యానికి ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read more