తగలబడిందా...తగలబెట్టారా..?

ABN , First Publish Date - 2022-09-28T06:17:11+05:30 IST

మండలంలోని పోలవరం పంచాయతీలో ఇసుక అక్రమార్కులు రెండు అనధికార క్వారీలు నిర్వహిస్తున్నారు.

తగలబడిందా...తగలబెట్టారా..?
తగులబడిన ఎక్స్‌కవేటర్‌

పోలవరంలో  ఇసుక రీచ్‌ వద్ద కాలిపోయిన ఎక్స్‌కవేటర్‌ 

ముండ్లమూరు, సెప్టెంబరు 27: మండలంలోని పోలవరం పంచాయతీలో ఇసుక అక్రమార్కులు రెండు అనధికార క్వారీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం మేదరమెట్ల గ్రామానికి చెందిన మహిళ నిర్వహిస్తున్న క్వారీలో ఎక్స్‌కవేటర్‌-110ని గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఐతే నిర్వాహకురాలు మాత్రం దీనిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు.  ఎక్స్‌కవేటర్‌ విలువ రూ.30 లక్షలు ఉంటుందని సమాచారం. కొంతకాలంగాదర్శికి చెందిన కొంత మంది వైసీపీ నేతలకు, మేదరమెట్లకు చెందిన ఒకరు అనధికారికంగా ఇసుక క్వారీలు నిర్వహిస్తూ రాత్రుళ్లు ఇసుకను పెద్దఎత్తున తరలిస్తున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతిలో ఈనెల 26న ‘తవ్వుకుంటాం... అమ్ముకుంటాం’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది.  24గంటలు గడవక ముందే ఇసుక అక్రమార్కులు ఒకరిపై మరొకరు కక్షతో ఎక్స్‌కవేటర్‌ను తగులబెట్టి ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మొత్తం మీద క్వారీ నిర్వహిస్తున్న ఇద్దరూ వైసీపీవారే.  


ఒకరి క్వారీని ఒకరు దెబ్బతీసేందుకేనా? 

ఎక్స్‌వేటర్‌ కాలిపోవడం వెనుక క్వారీ నిర్వహిస్తున్న వారిలో ఒకరికొకరు దెబ్బతీసుకునే ప్రయత్నంలోనే ఇలా చేశారా..? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేదానిపై చర్చ సాగుతోంది. 

Updated Date - 2022-09-28T06:17:11+05:30 IST