సచివాలయాలతో మెరుగైన సేవలు

ABN , First Publish Date - 2022-11-30T22:00:46+05:30 IST

నవర త్నాలలో భాగంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అం దిస్తున్నట్లు ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డి అన్నారు. మండలంలోని సీతానాగుల వరంలో సచివాలయ భవనాన్ని ప్రారం భించారు.

సచివాలయాలతో మెరుగైన సేవలు
సచివాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

తర్లుపాడు, నవంబరు 30 : నవర త్నాలలో భాగంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అం దిస్తున్నట్లు ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డి అన్నారు. మండలంలోని సీతానాగుల వరంలో సచివాలయ భవనాన్ని ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సచివాలయల ద్వారా అర్హులకు సంక్షేమ పథకాలు త్వరితగతిన అందుతున్నాయన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రానికి ఎమ్మెల్యే కె.నాగార్జున రెడ్డి భూమి పూజ చేశారు. సీతానాగులవరంలో ఇప్పటి వరకు అంగన్‌వాడీ భవనం లేకపోవడంతో అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. రూ.22 లక్షలతో కేంద్రా న్ని నిర్మించనున్నట్లు ఏఈ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్‌. భూలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు వెన్నా ఇందిర, సర్పంచ్‌ ఆంజనేయులు, ఎంపీటీసీ స భ్యులు సాలమ్మ, ఎంపీడీవో నరసింహులు, సూపర్‌వైజర్‌ లక్ష్మీదేవి పాల్గొన్నారు.

అదనపు తరగతి గదులకు శంకుస్థాపన

మండలంలోని మీర్జపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గ దులకు ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.1.10లక్షలతో అదనపు తరగతి గదులు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కో ట్లాది రూ పాయలు ఖర్చు చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. నాడు-నేడుతో విద్యా ర్థులకు సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం మీర్జపేటలో రూ.1775000తో జలజీవన్‌ మిషన్‌ కింద ఇంటింటి కుళాయి కనెక్షన్లు ఎమ్మెల్యే ప్రారంభించారు. కారుమానిపల్లెలో రూ.1810000తో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌కు భూమి పూజ చేశారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకు పూర్తయితే మంచి నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పెద్ద మీరా వలి, ఎంపీటీసీ సభ్యులు పార్వతి, ఎంపీడీవో ఎస్‌.నరసింహులు, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ జ్యోతి సృజన, ఏవో చంద్రశేఖర్‌, నాయకులు డి.భాస్కర్‌రెడ్డి, కాశయ్య, మల్లారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T22:00:55+05:30 IST