బీట్‌ వ్యవస్థను పటిష్ఠం చేయాలి

ABN , First Publish Date - 2022-11-16T23:32:33+05:30 IST

నేర నియంత్రణకు బీట్‌ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశించారు. మండలంలోని రేణంగివరం పోలీ్‌సస్టేషన్లో బుధవారం ఎస్‌పీ వార్షిక తనిఖీలు నిర్వహించారు.

బీట్‌ వ్యవస్థను పటిష్ఠం చేయాలి

పంగులూరు, నవంబరు 16 : నేర నియంత్రణకు బీట్‌ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశించారు. మండలంలోని రేణంగివరం పోలీ్‌సస్టేషన్లో బుధవారం ఎస్‌పీ వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తనిఖీలో స్టేషన్‌ పరిధిలో లా అండ్‌ ఆర్డర్‌ సమస్యల గురించి, స్టేషన్‌ పరిధిలో జరిగిన నేరాల గురించి సమీక్షించామన్నారు. పోలీస్‌ సిబ్బంది, అధికారులు, సచివాలయ మహిళా పోలీసుల పనితీరును పరిశీలించి శాఖా పరంగా వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నామన్నారు. స్టేషన్‌ పరిధిలో విచారణ దశలో ఉన్న కేసుల వివరాలను, పెండింగ్‌ కేసుల వివరాలను, వాటి సత్వర పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తగు సూచనలు చేశామన్నారు. మండలంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో వాటి నివారణకు అధికారులు తీసుకున్న చర్యలను సమీక్షించామన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలలో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశామన్నారు. మహిళా పోలీసులు ప్రజలకు లోన్‌ యాప్‌ల గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. దొంగతనాల నివారణకు బీట్‌ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్నారు. అదే విదంగా దొంగతనం కేసులు ఛేదించి చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఎస్పీ జిందాల్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ అధికారి పి.శ్రీకాంత్‌, బాపట్ల స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏ.శ్రీనివాస్‌, అద్దంకి రూరల్‌ సీఐ ఎం.రోశయ్య, స్థానిక ఎస్‌ఐ కె.తిరుపతయ్య, ఎస్పీ సీసీ మరికృష్ణ, ఇతర పోలీస్‌ అధికారులు, పోలీస్‌ సిబ్బంది, గ్రామ సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T23:32:33+05:30 IST

Read more