బాబు కావాలి.. జగన్‌ పోవాలి

ABN , First Publish Date - 2022-10-11T06:13:55+05:30 IST

రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్య మంత్రి కావాలి జగన్‌ పోవాలి అని టీడీపీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు అన్నారు.

బాబు కావాలి.. జగన్‌ పోవాలి
కరపత్రాలు అందజేస్తున్న టీడీపీ నాయుకులు

కొమరోలు, అక్టోబరు 10:  రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్య మంత్రి కావాలి జగన్‌ పోవాలి అని టీడీపీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని నల్లగుంట్ల గ్రామంలో సోమవారం బాదుడేబాదుడు కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజ లకు కరపత్రాల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు భారత దేశంలో మంచిగుర్తిపు వచ్చిందన్నారు. పిల్ల కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే చేస్తున్నారని విమర్శించారు. ప్రతి పేద, మధ్య తరగతి వారిపై జగన్‌ సర్కార్‌ పన్నుల భారం అధికం చేసిందన్నారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించిన ఘనత అశోక్‌రెడ్డిదేనన్నారు. నియోజకవర్గం లోని మారు మూల గ్రామీణ ప్రాంతాల రోడ్లు, గ్రామాల్లోని అంతర్గత రోడ్లను సిమెంటు రోడ్లుగా అభివృద్ధి చేసిన ఘనత అశోక్‌రెడ్డిదేనన్నారు. కార్యక్రమంలో తెలుగురైతు జిల్లా కార్యదర్శి వీవీ రాఘవరెడ్డి, టీడీపీ మండ ల ప్రధాన కార్యదర్శి బిజ్జాల తిరుమలరెడ్డి,  ఎంపీటీసీ మాజీ సభ్యుడు ముత్తుముల సంజీవరెడ్డి, బోడ్డు రంగయ్య, ఎంబీసీ స్టేట్‌ సభ్యుడు అనపా వీరశేఖర్‌, కాంట్రాక్టర్‌ క్రిష్ణమోహన్‌రెడ్డి, నాయకులు బిజ్జం వెంకట్రామి రెడ్డి,  జ్యోతిఇంద్రారెడ్డి, బోయిళ్ల బాలిరెడ్డి, పందరబోయిన గోపాలక్రిష్ణ, గుర్రం కృష్ణబాబు, పి.విజయ్‌కుమార్‌రెడ్డి, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Read more