వాడవాడలా మువ్వన్నెల రెపరెపలు

ABN , First Publish Date - 2022-08-16T05:25:13+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.

వాడవాడలా మువ్వన్నెల రెపరెపలు
ఇసుకదర్శిలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ జండాను ఎగుర వేస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

వెల్లివిరిసిన  దేశభక్తి 

పలుచోట్ల ర్యాలీలు

వివిధ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను

  ఎగురవేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు

చీరాల, ఆగస్ట్టు 15: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.  వాడవాడలా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ఎమ్మెల్యే కరణం బలరామకృష ్ణమూర్తి ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభి వృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో ఆర్డీఓ సరోజిని, తహసీల్దార్లు ప్రభా కరరావు, సంధ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెం కటేష్‌ జాతీయజెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ము న్సిపల్‌ కమిషనరల్‌ సీహెచ్‌ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొత్తపేటలోని రూరల్‌సర్కిల్‌ కార్యా లయం వద్ద డీఎస్పీ శ్రీకాంత్‌, అసఫ్‌ఆలీ ఉర్దూ పాఠశాలలో హెచ్‌ఎం ఫిరోజ్‌బేగం జాతీయ జెండాను ఎగురవేశారు.

కొత్తపేటలోని టీడీపీ కార్యాలయం వద్ద ఆపార్టీ నియో జకవర్గ ఇన్‌చార్జి ఎంఎం కొండయ్య, బీజేపీ కార్యాలయం వద్ద ప్రముఖ న్యాయవాది బండారుపల్లి హేమంత్‌కుమార్‌, సెయింట్‌ఆన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్‌ శ్రీమంతుల లక్ష్మణరావు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.


జాతీయ నాయకులు అందరికి స్ఫూర్తి 

అద్దంకిటౌన్‌, ఆగస్టు 15:  స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులు అందరికి స్ఫూర్తి అని సీనియర్‌ సివిల్‌ జడ్జి బి.బాబునాయక్‌ అన్నారు. సోమవారం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, పాఠశాలలో ఘనంగా జరిగాయి.  స్థానిక కోర్టు సముదా యాల ఆవరణలో బాబునాయక్‌ జాతీయ జెండాను ఆ విష్కరించారు. అజాదీకా అ మృత్‌మహోత్సవాల్లో భాగంగా తిమ్మాయపాలెం హైస్కూల్‌ నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్ధినులకు న్యాయమూర్తులు బహుమతులు అందజేశారు. 

నగర పంచాయతీ కార్యాలయం వద్ద చైర్‌పర్సన్‌ లక్కిబో యిన ఏస్తేరమ్మ, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ అవిశన జ్యోతి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన వేడుకలల్లో వివిధ విభాగాల్లో ప్రతిభకనబరిచిన అధికారులు, సిబ్బంది, వలం టీర్లుకు శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.  కార్యక్రమాల్లో ఎంపీడీవో ఏ.రాజేందర్‌, నగర పంచాయతీ కమిషనర్‌ ఎం.శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్‌ సుబ్బారెడ్డి,  ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ చైర్మన్‌ కోటా శ్రీనివాసకుమార్‌ ఆయా చోట్ల త్రివర్ణ పతా కాన్ని ఎగురవేశారు. పోలిస్‌స్టేషన్‌, ప్రభుత్వ వైద్యశాల, లేబర్‌ ఆఫీస్ద్‌, విద్యుత్‌ శాఖ డీఈ కార్యాలయం, ఆర్టీసీ డిపో, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల వద్ద అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. 

అద్దంకిటౌన్‌: అద్దంకి పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద పంద్రాగస్టు వేడుకలను  ఘనంగా నిర్వహించారు. అ ద్దంకి పట్టణ, మండల, గ్రామ టీడీపీ నాయకులు, కార్య కర్తలు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

పంగులూరు: మండలంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  ఎంపీపీ తేళ్ళ నాగమ్మ, త హసీల్దార్‌ పద్మావతి, సచివాలయం వద్ద సర్పంచ్‌ గుడి పూడి నాగేంద్రం జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమణమూర్తి, జడ్పీటీసీ రాయిణి ప్రమీల తదితరులు పాల్గొన్నారు. పంగులూరులో సీఎస్‌కే ఫౌండేషన్‌ వ్యవస్దాపకుడు షడ్రక్‌ నిర్వహిస్తున్న వృద్ధుల ఆశ్రమంలో దుప్పట్లు పంపిణీచేశారు. 

బల్లికురవ: మండలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ప్రదర్శించారు. బల్లికురవలోని టీడీపీ కార్యాలయంలో అపార్టీ నేతలు కొండేటి ఇజ్రాయల్‌, మలినేని గోవిందరావు, గొట్టిపాటి లక్ష్మయ్య, పావులూరి ఏడుకొండలు, అట్లూరి నాగేశ్వరరావు జాతీయ జెండాను ఎగ రవేశారు.  తహ సీల్దార్‌ కార్యాలయం, ప్రజాపరిషత్‌ కార్యాలయం, ఎంఈవో కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌, పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలో జాతీయ జెండాలను ఎగురవేశారు.

సంతమాగులూరు: మండలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీడీవో సాంబశివరావు, తహసీల్దార్‌  అశోక్‌వర్ధన్‌, సీఐ శివరామకృష్ణారెడ్డి,  ఎంఈ వో వేమవరపు కోటేశ్వరరావు ఆయా కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఎగురవేశారు. అలాగే, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు.  మండలంలోని పుట్టావారిపాలెం టీడీపీ కార్యాలయంలో  జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక బాలాజీ హైస్కూల్‌ ఆధ్వర్యంలో 200 మీటర్ల జాతీయ పతాకంలో సంతమాగులూరులో ప్రదర్శన నిర్వహించారు.  


 జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలి

పర్చూరు, ఆగస్టు 15: ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రావి రామనాథంబాబు అన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సోమవారం స్థానిక బొమ్మల సెంటర్‌ కూడలిలో ఆయా పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. భారీ జాతీయ పతాకంతో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ దేశభక్తిని చాటుకుంది. ఈ సందర్భంగా రామ నాథంబాబు మాట్లాడు తూ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మహా త్ముల త్యాగాలను మరువ రాదన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌ రావి పద్మావతి, ఎంఈవో డి.నాగేశ్వరరావు, ఎంపీపీ మేకా ఆనందకుమారి, మాజీ జడ్పీటీసీ కొల్లా సుభాష్‌బాబు, కోటా హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

అలాగే, స్థానిక కోర్టు భవనాల సముదాయంలో న్యాయ మూర్తి జి.కుముదిని జాతీయ జండాను ఆవిష్కరించారు. తహసీల్దార్‌ నెహ్రుబాబు, ఎంపీడీవో లక్ష్మీదేవి,  ఎస్సై లక్ష్మీ భవానీ ఆయా కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఎగురవేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికా రులు జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. 

మార్టూరు: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సోమవా రం మండలంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విద్యా లయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు విద్యాలయా లు, గ్రామ సచివాలయాల వద్ద జాతీయ జండాలను ఎగురవేశారు. ఇసుకదర్శిలో క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జాతీయ జండాను ఎగు రవేశారు. శ్రీహర్షిణి విద్యాలయం వద్ద సీఐ ఐ.ఆంజనేయరెడ్డి, పోలీ సుస్టేషన్‌ వద్ద ఎస్‌ఐ రవీంద్రరెడ్డి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ భుక్యా శాంతిబాయి, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ చుండి సుజ్ణానమ్మ జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ వెంకట శివ రామిరెడ్డి, వి శ్రాంత ఉద్యోగుల భవనం వద్ద అధ్యక్షుడు షేక్‌ కమాలు ద్దీన్‌, వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద ఏవో కిరణ్‌ కుమార్‌, సీఐటీయూ కార్యాలయం వద్ద బత్తుల హను మంతరావు, తదితర కార్యాలయాల వద్ద జాతీయ పతాకా లను ఆదిష్కరించారు.

యద్దనపూడి మండల కేంద్రంలో తహసీల్దార్‌ బి.వెం కటరెడ్డి, ఎంపీపీ పులగం రజని, ఎస్‌ఐ డి.రత్నకుమారి,  ఏవో ఆదినారాయణ, ఏపీవో రమేష్‌ ఆయా కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఎగురవేశారు. అలాగే, వివిధ కార్యాలయాలు,  గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద, ప్రభుత్వ విద్యాలయాల వద్ద ఉపాద్యాయులు ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. 

చినగంజాం: తహసీల్దార్‌ పాలపర్తి పార్వతి, ఎంపీపీ కోమట్ల అంకమ్మరెడ్డి, ఎంపీడీవో డి.విజయలక్ష్మీ,  ఎస్‌ఐ పి.నాగబాబు, విద్యుత్‌ ఏఈ పి.గణనారాయణ,  వైద్యాధి కారి డాక్టర్‌ ఎస్‌.విజయభాస్కరరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రేపాక మంగతయారు, చినగంజాం గ్రామ సర్పంచ్‌ రాయని ఆత్మారావు ఆయా కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. నీలాయపాలెం, కడవ కుదురు, కొత్తపాలెం సర్పంచ్‌లు  తూమాటి శ్రీనివాసరావు, జి.శివకుమారి, ఆసోది బ్రహ్మారెడ్డి ఆయా కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఎగురవేశారు.

మండల పరిఽధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల వద్ద విద్యా కమిటీ చైర్మన్లు, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ఆయా గ్రామాల సర్పంచ్‌లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. చినగంజాంలోని వాల్మీకి వృద్దాశ్రయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహిం చారు. స్థానిక సత్యం హైస్కూల్‌ కరస్పాండెంట్‌ ఎన్‌.హర నాథ్‌బాబు ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులు భారతమా త, మహాత్మాగాంధీ, నెహ్రు, అల్లూరి సీతారామరాజు, సైనికుల వేషధారణలతో జాతీయ జెండాలను చేతబూని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కడవకుదురు వాణి విద్యా నికేతన్‌ విద్యార్థులు జాతీయ నాయకులు, భారతమాత వేషధారణలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.  

ఇంకొల్లు: మండలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో తివర్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇంకొల్లు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ బండారు అనూష త్రివర్ణ పతాకాన్ని  ఆవిష్కరించారు. ఇంకొల్లులో ఆటోవర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సుమారు 35 ఆటోలతో జెండాలు కట్టుకొని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఇంకొల్లు గౌతమి హైస్కూల్‌ విద్యార్థులు 150 అడుగుల జాతీయ జండాతో  ర్యాలీ నిర్వహించారు.

కారంచేడు(పర్చూరు): 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కారంచేడు మండలంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలపై జాతీయ జండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు.  ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు జాతీయ జండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటరత్నం, జడ్పీటీసీ యార్లగడ్డ రజని, వైస్‌ ఎంపీపీ యార్లగడ్డ సుబ్బారావు, ఎంఈవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Read more