-
-
Home » Andhra Pradesh » Prakasam » Anxiety until the kandukur continues in the aura-MRGS-AndhraPradesh
-
కందుకూరుని ప్రకాశంలోనే కొనసాగించేవరకూ ఆందోళన
ABN , First Publish Date - 2022-03-17T04:31:39+05:30 IST
కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించేవరకూ ఆందోళన కొనసాగిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. కందుకూరుకి డివిజన్ హోదా కొనసాగిస్తూ నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలన్న డిమాండ్‌తో స్థానిక సబ్ కలెక ్టరు కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలు బుధవారం 41వ రోజుకి చేరాయి.

41వ రోజూ కొనసాగిన రిలే దీక్షలు
కందుకూరు, మార్చి 16: కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించేవరకూ ఆందోళన కొనసాగిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. కందుకూరుకి డివిజన్ హోదా కొనసాగిస్తూ నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలన్న డిమాండ్‌తో స్థానిక సబ్ కలెక ్టరు కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలు బుధవారం 41వ రోజుకి చేరాయి. ఈ దీక్షలకు సంఘీభావంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కందుకూరులో ఇంత ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం కనీసం న్యాయం చేస్తామని కూడా ప్రకటించకపోవటం శోచనీయమని , ఈ ప్రభుత్వానికి ప్రజాభిప్రాయంతో పనిలేదని విమర్శించారు. దీక్షలలో నాగేశ్వరరావుతో పాటు టీడీపీ నాయకులు బొల్లినేని నాగేశ్వరరావు, ఎన్‌వీ సుబ్బారావు, కేశవ, షేక్ రఫి, నాగేశ్వరరావు, వీరాస్వామి, ఎన్. రమణయ్య, సింహాద్రి, మాల్యాద్రి, డీసీహెచ్ మాలకొండయ్య, కసుకుర్తి మాల్యాద్రి, జి.హరిబాబు, బెజవాడ ప్రసాదు, రేణమాల అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.