అంగన్‌వాడీల నిరసన

ABN , First Publish Date - 2022-03-04T05:32:59+05:30 IST

సమస్యలను వెంటనే పరిష్క రించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

అంగన్‌వాడీల నిరసన
ప్రదర్శనలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్తలు

మార్కాపురం(వన్‌టౌన్‌), మార్చి 3:  సమస్యలను వెంటనే పరిష్క రించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సంద ర్భంగా యూనియన్‌ నాయకురాలు టి.రేణుక మాట్లాడుతూ అంగన్‌వా డీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26వేలు అ మలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రాలలో ప్రవేశ పెట్టనున్న నూతన విద్యా విధానం అమలను విరమించుకోవాలన్నారు. గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్‌ ఇవ్వాలన్నారు. అం గన్‌వాడీ కేంద్రాలకు వెంటనే స్మార్ట్‌ఫోన్లను అందించాలన్నారు. సమస్యల పరిష్కారంలో తాత్సా రం చేయడం సరికాదని ప్రభుత్వాన్ని కోరుతూ ఆర్డీవో లక్ష్మీశివజ్యోతికి విన తిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఏఐ టీయూసీ నాయకులు ఖాసిం పాల్గన్నారు.  


Read more