అరాచక పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2022-09-30T05:20:16+05:30 IST

వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడి టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి, అద్దంకి నియోజకవర్గ పరిశీలకుడు తు రకా వీరాస్వామి అన్నారు.

అరాచక పాలనకు చరమగీతం పాడాలి
టీడీపీ నాయకులతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరాస్వామి

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి  వీరాస్వామి 

అద్దంకి, సెప్టెంబరు 29: వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడి టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి, అద్దంకి  నియోజకవర్గ పరిశీలకుడు తు రకా వీరాస్వామి అన్నారు. స్థానిక పోతురాజుగండి వద్ద టీడీపీ కార్యాలయంలో అద్దంకి మండల, పట్టణ నాయకులు, బీసీ నాయకులతో గురువారం సమా వేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా వీరాస్వామి మాట్లాడుతూ వైసీపీ పాల నలో బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం గాలికి వదిలివేశారన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నిక లు ఎప్పుడువచ్చినా టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడి పనిచే యాలన్నారు. సమావేశంలో టీడీపీ మైనార్టీ సెల్‌ పల్నాడు జిల్లా  అధ్యక్షుడు సయ్యద్‌ అమీర్‌ఆలీ, అద్దంకి మండల, పట్టణ అధ్యక్షులు కఠారి నాగేశ్వరరావు, చిన్ని శ్రీనివాసరావు,  కొనికి శ్రీను, అద్దంకి మండల, పట్టణ బీసీ సెల్‌ అధ్యక్షు లు బండారు రాఘవ, యర్రాకుల రామాంజనేయులు, క్లష్టర్‌ ఇంచార్జి కుందా రపు రామారావు, అద్దంకి  నరేష్‌, గుంజి శ్రీనివాసరావు, గుంజి హనుమంత రావు, కోటిలింగాచారి, యనగండ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Read more