నాటి విద్యార్థుల అపూర్వ కలయిక

ABN , First Publish Date - 2022-09-19T06:00:57+05:30 IST

మార్కాపురంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో 1991-92 విద్యా సంవత్సరంలోని పదో తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది.

నాటి విద్యార్థుల అపూర్వ కలయిక
సమావేశమైన పూర్వ విద్యార్థులు

మార్కాపురం(వన్‌టౌన్‌), సెప్టెంబరు 18:  మార్కాపురంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో 1991-92 విద్యా సంవత్సరంలోని పదో తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. స్థానిక విహారీ గ్రాండ్‌ ఇన్‌లో జరిగిన సమావేశంలో అలనాటి మధుర జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. అప్పటి గురువులు మల్లిఖార్జునరావు, అల్లూరయ్య గౌడ్‌లను సన్మానించారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఇమ్మడి కాశీనాథ్‌ హాజరయ్యారు. మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన అనేక మంది ఉన్నత ఉద్యోగాలు సాధించారు.

Read more