శ్రీకూష్మాండదుర్గాదేవిగా అమ్మవారు

ABN , First Publish Date - 2022-09-30T05:20:53+05:30 IST

దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు నాలుగోరోజు శ్రీకూష్మాండదుర్గాదేవి అలంకారంలో శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

శ్రీకూష్మాండదుర్గాదేవిగా అమ్మవారు
త్రిపురాంతకంలో ఆలయ ప్రదక్షణ

త్రిపురాంతకం, సెప్టెంబరు 29: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు నాలుగోరోజు శ్రీకూష్మాండదుర్గాదేవి అలంకారంలో శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారికి, చిన్నమస్తాదేవికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈసందర్బంగా వేదపండితులు నాగఫణిశాస్త్రి, ఫణీంద్రకుమార్‌శర్మ, అర్చకులు ప్రసాద్‌శర్మ, విశ్వన్నారాయణశాస్త్రి అమ్మవారికి విశేష పూజలు చేశారు. 

గిద్దలూరు : పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజు గురువారం అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. షరాఫ్‌బజారులోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో 19వ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారు శ్రీవరాహవతార అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా హోమం ప్రత్యేకపూజలు ఉభయతదాతలతో నిర్వహించారు. దేవస్థాన కమిటీ అధ్యక్షుడు గంజి వీరయ్య, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. షిర్డిసాయిబాబా దేవాలయంలో కనకదుర్గ, కాళికాంబ దేవాలయాలలో శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాచర్ల రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవ పూజలు, వివిధ గ్రామాల్లోని అమ్మవారిశాలల్లో అలంకార పూజలు నిర్వహించారు. 

మార్కాపురం(వన్‌టౌన్‌) : దసరా శరన్నవ రాత్రులను పురస్కరించుకొని పట్టణంలోని ఆలయాల్లో గురువారం రాత్రి అమ్మవార్లు వివిధ అలంకరణలలో భక్తులు దర్శనమిచ్చారు. రాజ్య లక్ష్మీ అమ్మవారు ఽధాన్యలక్ష్మీగా, వాసవీ మాత అన్నపూర్ణగా, జగదాంబ కూష్మాండదుర్గగా, రమాదేవి ధనలక్ష్మీ, బంగారమ్మ మహాలక్ష్మీగా, సీతాదేవి మోహినీ అలంకారాలలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈవోలు ఈదుల చెన్నకేశవ రెడ్డి, జి.శ్రీనివాసరెడ్డి, ఆలయ ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ పి.కేశవరావు, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు పర్యవేక్షించారు.

Read more