బ్యాంకుల విలీనంతో పాట్లు

ABN , First Publish Date - 2022-12-09T23:45:45+05:30 IST

బ్యాంకుల విలీనంతో ఖాతాదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులను విలీనం చేసింది.

బ్యాంకుల విలీనంతో పాట్లు

భాష రాని అధికారులతో ఇబ్బందులు పడుతున్న రైతులు

మేదరమెట్ల, డిసెంబరు 9: బ్యాంకుల విలీనంతో ఖాతాదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులను విలీనం చేసింది. 75 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆంధ్రాబ్యాంక్‌ను యూ నియన్‌ బ్యాంక్‌లో విలీనం చేశారు. ఈ విలీనంతో కొరిశపాడు మండ లంలోని రైతులకు, ఖాతాదారు లకు అవస్థలు మొదలయ్యా యి. రావినూతలలో 1970కి ముందు నుంచి ఆంధ్రాబ్యాంక్‌, యూనియన్‌బ్యాంక్‌ ఖాతాదా రులకు సేవలు అందిస్తున్నా యి. రావినూతలలో కోఆపరే టివ్‌ సొసైటీ, జిల్లా కేంద్ర స హకార బ్యాంక్‌తో కలిసి నాలు గు బ్యాంక్‌లు ఉన్నాయి. నిబం ధనల ప్రకారం యూనియ న్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌లు చుట్టుపక్కల గ్రామాలను పం చుకున్నాయి. ఆయా గ్రామాల రైతులకు వ్యవసాయ రుణా లను బ్యాంక్‌లు అందజేసేవి.

విలీనంతో మొదలైన అవస్థలు

అయితే, ఈ రెండు బ్యాం కుల విలీనంతో ఖాతాదారుల కు ఇబ్బందులు ప్రారంభమ య్యాయి. రెండు బ్యాంకులలో ఉన్న వ్యవసాయ రుణాలు, వ్యవసాయం కోసం బంగారంపై ఇచ్చే రుణాలు, వివిధ వ్యాపారాల కోసం, డ్వాక్రా గూపుల ఖాతాలు, పొదుపు ఖాతాలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. బ్యాంక్‌లు విలీనం అయ్యాక ఖాతాదారులకు సేవలు పొందడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనికితోడు భాష తెలియని అధికారులను ఇక్కడ నియమించడం కూడా రైతులు రుణాలు పొందడానికి ప్రతిబంధకంగా మారింది.

పెరిగిన రద్దీ

సాధారణంగా జూలై, ఆగస్టులలో రైతులందరూ ఒకేసారి రుణాలు తీసుకుంటారు. అదే సమయంలో మండలంలోని పెద్ద సంఖ్యలో ఉన్న డ్వాక్రా గ్రూపులు కూడా రుణాల కోసం బ్యాంకులకు రావడంతో ఖాతా దారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50 ఏళ్లకు పైగా ఉన్న ఆంధ్రా బ్యాంక్‌ను తొలగించడం పట్ల ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రుణాలు పొందడానికి ఆంధ్రాబ్యాంక్‌ నిబంధ నలు వేరుగా, యూనియన్‌ బ్యాంక్‌ నిబంధనలు వేరుగా ఉండడంతో రైతులకు అసౌకర్యంగా మారింది. చిన్నచిన్న వ్యవసాయ రుణాలకు కూడా ఈసీ తదితర పత్రాలు అడగడం వలన రైతులకు ఖర్చు, సమయం పెరుగుతుంది. దీనికితోడు బ్యాంక్‌లో ఒకే ఒక్క కౌంటర్‌ ఉండడంతో లావాదేవీలకు చాలా సమయం పడుతుంది.

మరో బ్యాంకు ఏర్పాటుచేయాలి

రావినూతలలో మరో బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు. యూనియన్‌ బ్యాంక్‌ ఉన్నతాధికారులు స్పందించి తెలు గురాని అధికారులను గ్రామీణ ప్రాంతాల బ్యాంకులలో నియమిం చకుండా చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు. దీనితో పాటు ఖాతాదారులకు తక్కువ సమయంలో లావాదేవిలు పూర్తి చేసుకునే విధంగా మరో కౌంటర్‌ ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-09T23:45:52+05:30 IST