అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-01-28T05:41:05+05:30 IST

అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కొన సాగించాలని, కాని పక్షంలో అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చే యాలని శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య కో రారు.

అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలి

శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య


అద్దంకి, జనవరి27: అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కొన సాగించాలని, కాని పక్షంలో అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చే యాలని శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య కో రారు. అద్దంకిలోని ఆర్‌అండ్‌బీ బంగ్లాలో గురువా రం సాయంత్రం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అద్దంకి నియోజకవర్గంలో ని అత్యధిక మండలాలకు ఒంగోలు అత్యంత స మీపంలో ఉన్నందున గతంలో మాదిరి ప్రకాశం జిల్లాలో కొనసాగించాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. గతంలోనే ఈ విషయా న్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకు పోయామన్నారు.  బాపట్ల, చీరాల పట్ణణాలు ప క్క పక్కనే ఉన్నందున రెండు రెవెన్యూ డివిజన్‌లు చేయటం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పా రు. ఈమేరకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్‌లను  కలిసి వినతిపత్రాలు అందజేయనున్న ట్లు ఆయన వివరించారు.

 

ఏల్చూరులో రాస్తారోకో


సంతమాగులూరు(అద్దంకి) : అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కొనసాగించాలని లే నిపక్షంలో సంతమాగులూరు  మండలాన్ని నరసరావుపేట కేంద్రంగా ఏర్పడే పల్నాడు జిల్లాలో కలపాలని కోరుతూ సంతమాగులూరు మండ లం ఏల్చూరులో గురువారం నామ్‌రోడ్డు పై రా స్తారోకో  చేశారు. దీంతో వాహనాలు రెండు వైపు లా  నిలిచిపోయాయి. ఈ  రాస్తారోకోలో ఏల్చూ రు-1 ఎంపీటీసీ షేక్‌ ఆదామ్‌షఫీ, పలు పార్టీల నాయకులు దేశింగరాజు, సాంబశివరావు, నక్కా వెంకటేశ్వర్లు, అనిల్‌,షంషావలి, తదితరులు పా ల్గొన్నారు.


Read more