-
-
Home » Andhra Pradesh » Prakasam » actions are not wrong if they do not respond to public concerns RDO-NGTS-AndhraPradesh
-
ప్రజా సమస్యలపై స్పందించకపోతే చర్యలు తప్పవు: ఆర్డీవో
ABN , First Publish Date - 2022-04-24T07:55:48+05:30 IST
ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని లేకపోతే చర్యలు తప్పవని కనిగిరి ఆర్డీవో కిడారి సందీప్ కుమార్ హెచ్చరించారు.

కురిచేడు, ఏప్రిల్ 23: ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని లేకపోతే చర్యలు తప్పవని కనిగిరి ఆర్డీవో కిడారి సందీప్ కుమార్ హెచ్చరించారు. కురిచేడు తహసీల్దార్ కార్యాలయాన్ని సందీప్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల స్థాయి అధికారులతో రివ్యూ నిర్వహించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజలు దరఖాస్తు చేసుకుంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. అనంతరం గృహనిర్మాణ శాఖకు చెందిన లేఅవుట్‌ను పరిశీలించారు. ఎంతమంది గృహాలు నిర్మించారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రివ్యూ నిర్వహించారు. వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అలస్యం చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగుల్ మీరా, వైద్యాధికారి ప్రవీణ్, విద్యుత్ శాఖ ఏఈ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.