హాస్టళ్లలో వసతులు దారుణం

ABN , First Publish Date - 2022-11-24T22:51:26+05:30 IST

హాస్టళ్లలో వసతులు దారుణంగా ఉన్నాయని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధికార ప్రతి నిధి వెంకటస్వామి అసంతృప్తి వ్య క్తం చేశారు.

హాస్టళ్లలో వసతులు దారుణం
విద్యార్థులతో మాట్లాడుతున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు

దర్శి, నవంబరు 24: హాస్టళ్లలో వసతులు దారుణంగా ఉన్నాయని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధికార ప్రతి నిధి వెంకటస్వామి అసంతృప్తి వ్య క్తం చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ దర్శి పట్ట ణంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌, ఎస్సీ కళాశాల హాస్టల్‌ను గురువారం రా త్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ హాస్టల్‌లో బాత్‌రూంకు తలుపు లేకపోవడంతో దుప్పటి కట్టి ఉండ డాన్ని గుర్తించారు. మెనూ ప్రకారం ఆహారాన్ని అందించడం లేదని పలు వురు విద్యార్థులు సమస్యలను నా యకుల దృష్టికి తీసుకొచ్చారు. హా స్టల్‌లో వసతలు మెరుగుపర్చకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వెంకటస్వామి హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు రవితేజ, దర్శి నగర పంచాయతీ చైర్మన్‌ నారంశెట్టి పిచ్చయ్య, టీడీపీ మండలాధ్యక్షుడు చిట్టె వెంకటేశ్వర్లు, రాజకుమార్‌, జగదీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T22:51:26+05:30 IST

Read more