అభివృద్ధి పనులు వేగవంతం

ABN , First Publish Date - 2022-03-05T05:27:00+05:30 IST

పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. 19వ వార్డులో పార్క్‌ కాంపౌండ్‌ నిర్మాణానికి రూ.20 లక్షలు, 20వ వార్డులో సీసీ రోడ్డుకు రూ.7.50 లక్షలు, 23వ వార్డులో సీసీ రోడ్డుకు రూ.11 లక్షలు, 35వ వార్డులో సీసీ రోడ్డుకు రూ.9 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.

అభివృద్ధి పనులు వేగవంతం
వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి

ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి

మార్కాపురం, మార్చి 4: పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. 19వ వార్డులో పార్క్‌ కాంపౌండ్‌ నిర్మాణానికి రూ.20 లక్షలు, 20వ వార్డులో సీసీ రోడ్డుకు రూ.7.50 లక్షలు, 23వ వార్డులో సీసీ రోడ్డుకు రూ.11 లక్షలు, 35వ వార్డులో సీసీ రోడ్డుకు రూ.9 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చిల్లంచెర్ల బాలమురళీకృష్ణ, వైస్‌చైర్మన్లు షేక్‌ ఇస్మాయిల్‌, చీతరాజుపల్లి అంజమ్మ శ్రీనివాసులు, కమిషనర్‌ నయీమ్‌ అహమ్మద్‌, డీఈ సుభాని, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.  మండలంలోని బోడపాడులో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరుణాచెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికీ జగనన్న సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 19వ వార్డులో పర్యటించారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 

Read more