మట్టి మిద్దె కూలి మహిళ మృతి

ABN , First Publish Date - 2022-10-08T05:38:22+05:30 IST

దర్శి పట్టణంలోని పడమట బజారులో మట్టిమిద్దె కూలి ఓ మహిళ మృ తి చెందింది. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

మట్టి మిద్దె కూలి మహిళ మృతి
కూలిన మట్టి మిద్దె(ఇన్‌సెట్లో) కాశమ్మ(ఫైల్‌)

దర్శి, అక్టోబరు 7 : దర్శి పట్టణంలోని పడమట బజారులో మట్టిమిద్దె కూలి ఓ మహిళ మృ తి చెందింది. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికు ల కథనం ప్రకారం... తుపాకుల కాశమ్మ(35) భర్త వెంకటరావుతో కలిసి పడమట బజారులో నివా సం ఉంటుంది. ఆమె పుట్టిల్లు కూడా పక్కవీధిలో ఉంది. అక్కడ ఉన్న పాత మట్టిమిద్దె ఖాళీగా ఉండటంతో కాశమ్మ తరచూ అక్కడకు వెళ్లి కొంచెంసేపు ఉండి తిరిగి ఇంటికి వస్తుంటుంది. ఈ క్రమంలో శుక్రవారం కూ డా ఆ మిద్దెలోకి వెళ్లింది. రెండు రోజులుగా కురిసి వర్షాలకు మట్టిమిద్దె పైక ప్పు ఒక్కసారిగా కూలిపడటంతో కాశమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె కు ఇద్దరు కుమార్తెలు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు విలపించారు.


Read more