నాయుడుపాలెంలో కొండచిలువ కలకలం

ABN , First Publish Date - 2022-09-25T06:21:55+05:30 IST

మండలంలోని నాయుడుపాలెం పొలాల్లో తిరుగుతున్న 12 అడుగుల భారీ కొండచిలువను ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు.

నాయుడుపాలెంలో కొండచిలువ కలకలం
నాయుడుపాలెంలో కొండ చిలువను పట్టుకున్న పారెస్టు స్నేక్‌ రెస్కివర్‌

పుల్లలచెరువు, సెప్టెంబరు 24: మండలంలోని నాయుడుపాలెం పొలాల్లో తిరుగుతున్న 12 అడుగుల భారీ కొండచిలువను ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. శనివారం నాయుడుపాలెంలో రామిరెడ్డి అనే రైతు తన పొలంలో కొండచిలువ కదలికలను గుర్తించాడు. వెంటనే ఎర్రగొండపాలెం ఫారెస్టు స్నేక్‌ రెస్కివర్‌ మల్లికార్జునకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. అక్కడకు వచ్చిన మల్లికార్జున కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. అది కుందేలుని తిని ఉందని ఆయన తెలిపారు. అనంతరం ఫారెస్ట్‌ రేంజరు శ్రీనివాసరావుతో కలిసి నల్లమల అటవీ ప్రాంతంలో కొండచిలువను సురక్షితంగా వదిలిపెట్టారు. 

Updated Date - 2022-09-25T06:21:55+05:30 IST