సైబర్‌ నేరగాడి చేతిలో మోసపోయిన మిలటరీ ఉద్యోగి

ABN , First Publish Date - 2022-03-17T05:06:23+05:30 IST

దేశానికి రక్షణ కల్పిస్తూ భద్రతలో అనుక్షణం జాగ్రత్తలు వహిస్తున్న మిలటరీ ఉ ద్యోగి ఒకరు సైబర్‌ నేరగాడి వలకు చిక్కారు. మొత్తం రూ. 1.35,198 నగదును కోల్పోయాడు.

సైబర్‌ నేరగాడి చేతిలో మోసపోయిన మిలటరీ ఉద్యోగి


ఖాతా నుంచి రూ.1.35,198 గల్లంతు

పోలీసులకు ఫిర్యాదు


గిద్దలూరుటౌన్‌, మార్చి 16 : దేశానికి రక్షణ కల్పిస్తూ భద్రతలో అనుక్షణం జాగ్రత్తలు వహిస్తున్న మిలటరీ ఉ ద్యోగి ఒకరు సైబర్‌ నేరగాడి వలకు చిక్కారు. మొత్తం రూ. 1.35,198 నగదును కోల్పోయాడు. అందులో అకౌంట్‌ నుం చి రూ.10,198 పోగొట్టుకోగా, ఆ తర్వాత క్రెడిట్‌ ద్వారా రూ.1.25లక్షలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. గిద్దలూరు నగరపంచాయతీ పరిధిలోని పాములపల్లె మజరా గ్రామానికి చెందిన నక్కా కాశయ్య మిలటరీ జవాన్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల సెలవులకు ఇంటికి వచ్చా రు. కాశయ్యపేటీఎం యాప్‌ను వినియోగిస్తున్నారు. మం గళవారం మధ్యాహ్నం నిద్రిస్తున్న కాశయ్యకు ఫోన్‌కాల్‌వచ్చింది. ‘పేటీఎం యాప్‌ను వినియోగిస్తున్నావా అని అడిగారు. మీ పేటీఎం యాప్‌ బ్లాక్‌ అయింది, అది అన్‌బ్లాక్‌ కావాలంటే మీ సెల్‌ ద్వారా చేసుకోవచ్చని’ చెప్పా డు. వెంటనే కాశయ్య తన సెల్‌ ద్వారా వారితో లైన్‌లో ఉన్నాడు. అవతలి వ్యక్తి ఎనీ డెస్క్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ‘మీ ఏటీఎం కార్డు ముం దు, వెనుక ఫొటో తీసి పెట్టాలని’ సూచించాడు. వెంటనే కాశయ్య ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని కార్డు ఫొటోలు అప్‌లోడ్‌ చేశాడు. కొద్దిసేపటి తరువాత కాశయ్య అకౌంట్‌ నుంచి రూ.10,198 కట్‌ అయ్యాయి. ఇదేమిటి తన అకౌంట్‌లో డబ్బులు కట్‌ అయ్యాయని కాశయ్య అవతలి వ్యక్తితో మాట్లాడుతుంటే కొద్దిసేపటి తరువాత తిరిగి అకౌంట్‌లో జమ అవుతాయని నమ్మ బలికాడు. నమ్మిన మిలటరీ ఉద్యోగి సరేనన్నాడు. వెంటనే అవతలి వ్యక్తి డబ్బులు రావాలంటే ‘మీ క్రెడిట్‌ కార్డు ఫొటో తీసి పెట్టాలని’ చెప్పాడు. దానికి కాశ య్య ‘నా వద్ద క్రెడిట్‌ కార్డు లేదని, అది గతంలో ఉన్నప్పటికీ బ్లాక్‌ అయిందని’ చెప్పాడు. అంతటితో ఆ వ్యక్తి మీకు ‘మీ పేటీఎం అన్‌లాక్‌ కావాలంటే మీరు ప్లేస్టోర్‌లో స్లైస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకో’వాలని చెప్పాడు. దీంతో కాశయ్య స్లైస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి ఫొటోను అప్‌లోడ్‌ చేసి కుటుంబ విషయాలు కూడా అప్‌లోడ్‌ చేశాడు. వెంటనే కాశయ్యకు స్లైస్‌ కంపెనీ నుంచి క్రెడిట్‌ కార్డు మంజూరైంది. క్రెడిట్‌ కార్డు మంజూరుతోపాటు రూ.1.25 లక్షలు ఆ ఖాతకు జమయ్యాయి. మరో రెండు నిమిషాల్లో స్లైస్‌ క్రెడిట్‌ కార్డు అమౌంట్‌ రూ.1.25లక్షలు కూడా కట్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. వెంటనే కంగుతిన్న కాశయ్య అంతవరకు తనతో ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తికి ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. మరికొద్ది సేపటి తరువాత కాశయ్య స్లైస్‌ కంపెనీ కస్టమర్‌ కేర్‌ నుంచి కాల్‌ వచ్చింది. స్లైస్‌ కంపెనీ క్రెడిట్‌ కార్డు అమౌంట్‌ రూ.1.25లక్షలు షాపింగ్‌ చేశారు. ఆ డబ్బును నెలలో వడ్డీతో సహా కట్టాలని చెప్పడంతో కాశయ్య తాను మోసపోయానని గ్రహించారు. 

లబోదిబోమంటూ గిద్దలూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్‌ఐ బ్రహ్మనాయుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక ప్రకటనలో ఎస్‌ఐ బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పైగా ఉద్యోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నప్పటికీ కొందరు వారి మోసాలకు బలవుతున్నారని, సైబర్‌ నేరాల్లో మోసపోయి ఇబ్బందులు పడవద్దని ఆయన సూచించారు. 

Read more