మోటారు సైకిల్‌ను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి

ABN , First Publish Date - 2022-01-23T05:31:43+05:30 IST

మోటారు సైకిల్‌ను వెనుకనుంచి కంటైన ర్‌ లారీ ఢీ కొనడంతో ఒకరు దుర్మరణం చెందారు.

మోటారు సైకిల్‌ను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి

మద్దిపాడు, జనవరి 22: మోటారు సైకిల్‌ను వెనుకనుంచి కంటైన ర్‌ లారీ ఢీ కొనడంతో ఒకరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన శనివారం సీతారామపురం కొష్టాల వద్ద చోటుచేసుకొంది. పోలీసుల కథనం మేరకు.. నందిపాడు గ్రామానికి చెందిన పోతుల శ్రీనివాస రావు (60) ఓ గ్రానైట్‌ కంపెనీలో ట్రాక్టర్‌ డైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి విధులకు వెళ్ళి ఉదయం స్వగ్రామానికి వస్తున్నాడు. ఈసమయంలో ఖమ్మం జిల్లా నుంచి చెన్నై వెళుతున్న కంటైనర్‌ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తూ మోటారు సైకిల్‌ను వెనుకనుంచి ఢీకొట్టాడు. ప్రమాదంలో పోతుల శ్రీనివాసరావు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై పి.శ్రీరామ్‌ సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదతీరును పరిశీలించారు. మృతునికి భార్య,  ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.  ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

నిర్లక్ష్యం.. తరచూ ప్రమాదాలు

మద్దిపాడు, జనవరి  22: జాతీయ రహదారి నెత్తురోడుతోంది.  మ ద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌, వెల్లంపల్లి, సీతారామపురం కొష్టాలు, దొడ్డవరప్పాడు, ఏడుగుండ్లపాడు వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.   తాజాగా, శనివారం సీతా రామపురం కొష్టాలు వద్ద జరిగిన ప్రమాదంలో ద్విచక్రవాహన దారు డు దుర్మరణం చెందాడు. మితిమీరిన వేగం, రహదారుల నిబంధ నలు అతిక్రమించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మండలం లోని జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు పోలీసులు పెట్టారే కానీ వాటిని ప్రజలు ఇష్టానుసారం తొలగించడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రహదారి భద్రత అమలులో పోలీసులు, రవాణ శాఖ అధికారులు కూడా ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మద్దిపాడు మండలంలో జా తీయ రహదారిపై 2019లో జరిగిన ప్రమాదాల్లో 18 మంది మృతి చెందగా, 56 మంది క్షతగాత్రులయ్యారు. 2020లో 20 మంది మృతి చెందగా , 76 మంది క్షతగాత్రులయ్యారు. 2021లో 20 మంది మృతి చెందగా, 80 క్షతగాత్రులయ్యారు. మండలంలో జరిగిన రోడ్డు ప్రమా దాలలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలు కావడం విశేషం. 

రహదారి నిబంధనలపై యువతకు అవగాహన కల్పించాలి. ఆదిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. 

Read more