సమస్యల పరిష్కారానికి వేదిక

ABN , First Publish Date - 2022-10-12T03:52:57+05:30 IST

ప్రజల సమస్యలు సత్వరం పరిష్కరించేందుకు గడపగడపకు కార్య క్రమం సరైన వేదికని వైసీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జి కరణం వెం కటేష్‌ చెప్పారు.

సమస్యల పరిష్కారానికి వేదిక
వెంకటేష్‌కు స్వాగతం పలుకుతున్న స్థానికులు

వైసీపీ ఇన్‌చార్జి వెంకటేష్‌

చీరాల, అక్టోబరు 11 : ప్రజల సమస్యలు సత్వరం పరిష్కరించేందుకు గడపగడపకు కార్య క్రమం సరైన వేదికని వైసీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జి కరణం వెం కటేష్‌ చెప్పారు. వెంకటేష్‌ మున్సిపల్‌ పరిధిలోని 17వ వార్డు పాపరాజుతోటలో అధికారులు, మెప్మా బాధ్యులు, నాయకులు, కార్యకర్తలతో కలసి ఇంటింటికీ తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ పధకాలు, అమలుతీరు తెలిపే కరఫత్రాలు పంపిణీ చేశారు. ముందుగా వార్డు ప్రజలు వెం కటేష్‌కు ఘనస్వాగతం పలికారు. స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు వెంకటేష్‌ అత్యధిక ప్రాధాన్యతను ఇ చ్చారు. తనను సొంతమనిషిగా మీలో ఒకడిగా భావించడంటూ సన్నిహితంగా మెలగటంతో పలువురు తమ స మస్యలను తెలపగా అధికారులకు పరిష్కరించాలని వెంకటేష్‌ సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌, సచి వాల, మోప్మా అధికారులు, సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read more