రెండు బైక్‌లను ఢీకొట్టిన కారు

ABN , First Publish Date - 2022-12-30T23:10:42+05:30 IST

కురిచేడు సమీపంలో శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లను వెనువెంటనే ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, ఇరువురు గాయపడ్డా రు.

రెండు బైక్‌లను ఢీకొట్టిన కారు
వెంకటేశ్వర్లు మృతదేహం

ఒకరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు

హెల్మెట్‌ ఉండడంతో ప్రాణాలతో బయటపడిన బాధితులు

కురిచేడు, డిసెంబరు 30 : కురిచేడు సమీపంలో శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లను వెనువెంటనే ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, ఇరువురు గాయపడ్డా రు. వివరాల్లోకెళ్తే... దర్శి మండలం తూర్పు వెంకటాపురానికి చెందిన చింతలచెరువు వెంకటేశ్వరు ్ల(50) తన ద్విచక్రవాహనంపై కురిచేడు వస్తున్నారు. త్వరలో కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో యోగయ్య స్వామి తిరునాళ్లలో ప్రభ కట్టి మొక్కు తీర్చుకుందామని, అందుకు సంబంధించి పోలీస్‌ అనుమతి కోసం స్వగ్రామం నుంచి బయలుదేరారు. ఇతని వెనకనే కురిచేడు మండలం పడమర నాయుడుపాలెంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న పాణ్యం షమీ లా బేగమ్‌, ఆమె భర్త దర్శి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. వీరి కి ఎదురుగా వినుకొండకు చెందిన ఓ కారు వేగంగా వస్తూ కురిచేడు మండలంలోని పెనగమూరు సమీపంలో అదుపుతప్పి తొలుత వెంకటేశ్వర్లు ద్విచక్రవాహనాన్ని ఢీకొన్నది. దీంతో అతను ఎగిరిరోడ్డుపై పడడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. కారు అంతటితో ఆగకుండా మృతుడి బైక్‌ వెనకనే బైక్‌పై వస్తున్న షర్మిలా బేగం ఆమె భర్త శ్రీనులను కూడా ఢీకొట్టింది. దీంతో వారిద్దరికీ బలమైన గాయాలయ్యా యి. శ్రీను హెల్మెట్‌ ధరించి ఉండటంతో అతనికి ప్రాణాపాయం తప్పగా కాలు విరిగింది. వెంటనే బాధితుడ్ని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తీసుకెళ్లారు. కారు డ్రైవర్‌ వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఎస్‌ఐ దేవకుమార్‌ కేసు నమోదు చేశారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని దర్శి సీహెచ్‌సీ వైద్యశాలకు తరలించారు. వెంకటేశ్వర్లు కూడా హెల్మెట్‌ ధరించి ఉన్నట్లయితే ప్రాణాలు కోల్పోయేవాడు కాదని పోలీసులు చెప్పారు.

Updated Date - 2022-12-30T23:10:42+05:30 IST

Read more