బ్లేడుతో ప్రియుడి మర్మాంగం కోసిన మహిళ

ABN , First Publish Date - 2022-09-17T13:22:43+05:30 IST

కొండపి మండలంలోని మూగచింతల గ్రామం లో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ ప్రియుడి మర్మాంగాన్ని

బ్లేడుతో ప్రియుడి మర్మాంగం కోసిన మహిళ

ప్రకాశం: కొండపి మండలంలోని మూగచింతల గ్రామం లో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. బాధితుడు (60) అదే గ్రామానికి చెందిన మహిళ (55) తో  పదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరికి ఇటీవల ఆర్థిక, ఇతర మనస్పర్థలు తలెత్తాయి. ఈనేపథ్యంలో మహిళ ఇంటికి వచ్చిన ప్రియుడిని బ్లేడుతో మర్మాంగాన్ని కోసింది. వెంటనే పొరుగువారు బాధితుడిని ఒంగోలు రిమ్స్‌లో చేర్చారు. అక్కడ బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు కొండపి ఎస్సై కె. రామకృష్ణ శుక్రవారం కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-09-17T13:22:43+05:30 IST