ముఖ హాజరులో లొకేషన్‌ అప్‌డేట్‌కు అవకాశం

ABN , First Publish Date - 2022-11-08T05:11:58+05:30 IST

ముఖ హాజరు విధానంలో లొకేషన్‌ తప్పుగా నమోదు చేసిన వారికి మార్చుకునే అవకాశాన్ని కల్పించినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

ముఖ హాజరులో లొకేషన్‌ అప్‌డేట్‌కు అవకాశం

అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ముఖ హాజరు విధానంలో లొకేషన్‌ తప్పుగా నమోదు చేసిన వారికి మార్చుకునే అవకాశాన్ని కల్పించినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. పలుచోట్ల ప్రధానోపాధ్యాయులు లొకేషన్‌ను పొరపాటుగా నమోదుచేయడం వల్ల హాజరు తీసుకోవడం లేదని, అలాంటివారు బుధవారం తప్పులను సరిదిద్దుకుని లొకేషన్‌ అప్‌టేడ్‌ చేసుకోవాలని సూచించింది. ఈ అంశంలో ఎవరికీ మినహాయింపులు ఉండవని, అందరూ తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాలని స్పష్టంచేసింది.

Updated Date - 2022-11-08T05:12:00+05:30 IST