జూన్‌ 21లోగా సమగ్ర సమాచారం

ABN , First Publish Date - 2022-05-18T08:36:53+05:30 IST

పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌లో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ మరమ్మతు పనులు,

జూన్‌ 21లోగా సమగ్ర సమాచారం

డయాఫ్రం వాల్‌, ఈసీఆర్‌ఎ్‌ఫపై రాష్ట్రానికి జలశక్తి శాఖ ఆదేశం


అమరావతి/న్యూఢిల్లీ, మే 17(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌లో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ మరమ్మతు పనులు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం నిర్మాణాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వచ్చే నెల 21లోగా పంపాలని కేంద్ర జలశక్తి శాఖ.. రాష్ట్ర జల వనరుల శాఖను ఆదేశించింది. మంగళవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌ కార్యాలయంలో జలశక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె అధ్యక్షతన సమావేశం జరిగింది. డయాఫ్రం వాల్‌, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంలకు  సంబంధించి రాష్ట్రప్రభుత్వం సమర్పించిన డిజైన్లపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకరబాబు, కేంద్ర జలసంఘం చైర్మన్‌ గుప్తా, పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ పాల్గొన్నారు. ప్రాజెక్టును సందర్శించిన తర్వాతే సంబంధిత డిజైన్లను ఖరారు చేయాలని నిర్ణయించారు. 22న శ్రీరాం నేతృత్వంలో ప్రాజెక్టును సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రస్తుత భేటీలో చర్చించిన డిజైన్లలో ఒకదానిని ఖరారు చేస్తారు. బుధవారం జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో పోలవరంపైనే కీలక భేటీ జరుగనుంది.

Updated Date - 2022-05-18T08:36:53+05:30 IST