Polavaram: ఏపీ ప్రజలు పోలవరంపై ఆశలు చంపుకోవాల్సిందేనా?

ABN , First Publish Date - 2022-07-28T01:56:30+05:30 IST

వరద బాధితుల (Flood victims) సహాయంపై సీఎం జగన్ (CM Jagan) చేతులెత్తేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో..

Polavaram: ఏపీ ప్రజలు పోలవరంపై ఆశలు చంపుకోవాల్సిందేనా?

అమరావతి/హైదరాబాద్: వరద బాధితుల (Flood victims) సహాయంపై సీఎం జగన్ (CM Jagan) చేతులెత్తేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులతో కేంద్రం ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం తరపున వరదసాయం అందించగలమని చెప్పారు. 500 కోట్లు, వెయ్యి కోట్లు అయితే తన చేతిలో ఉంటుందని, కేంద్రం నిధులు ఇస్తేనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ (R&R package) అమలు చేయగలమని తెలిపారు. రూ. 20 వేల కోట్లు అంటే తన చేతిలో ఎక్కడ ఉంటుంది? అని ప్రశ్నించారు. వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి... ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతామని పేర్కొన్నారు. స్వయంగా ప్రధాని మోదీ (Prime Minister Modi)ని కలిసి సమస్యలు వివరిస్తానని ప్రకటించారు. వరద బాధితులు తమను తిట్టుకుంటున్నారని కూడా ప్రధానికి చెబుతానని చెప్పారు. త్వరగా ఆర్థిక సాయం అందించాలని మోదీకి విజ్ఞప్తి చేస్తానని ప్రకటించారు. బాధితులకు సాయం ఎప్పటికైనా ఇవ్వక తప్పదు కదా అని వైరాగ్యంతో మాట్లాడారు. సాయం త్వరగా అందిస్తే అంతా సంతోషపడతారని ప్రధానికి చెబుతానని సీఎం వివరించారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌ అడిగానని, పరిహారం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు. పరిహారం ఇస్తేనే ప్రాజెక్టుల్లో నీళ్లు నింపుతామని, సెప్టెంబర్‌ నాటికి పరిహారం, పునరావాసం కల్పిస్తామని జగన్‌ హామీ పడ్డారు.


ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు పోలవరంపై ఆశలు చంపుకోవాల్సిందేనా?

జగన్ రెడ్డి విధ్వంసకర పాలనకు జీవనాడి బలవుతోందా?

ఎత్తు తగ్గించకుండా నిల్వ తగ్గించే కుటిల ఎత్తుగడ వేశారా?

కేంద్రంతో యుద్ధం చేస్తున్నా అనే మాటలు హాస్యాస్పదం కావా?

కుస్తీ పట్టాల్సింది ప్రజల మీడియాతో కాదండీ జగన్? అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు..



Updated Date - 2022-07-28T01:56:30+05:30 IST