కర్షకులుగా.. కలెక్టర్లు!

ABN , First Publish Date - 2022-09-26T08:29:25+05:30 IST

నిత్యం ఫైళ్లపై పచ్చని సంతకాలు పెట్టే దంపతులైన ఆ కలెక్టర్లు ఇద్దరూ.. తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆదివారం ఆటవిడుపుగా పొలంబాట పట్టారు. రైతులతో కలిసి నాట్లు వేస్తూ వారిలో ఉత్సాహం నింపారు.

కర్షకులుగా.. కలెక్టర్లు!

ఆటవిడుపుగా వరినాట్లు వేస్తూ సందడి

రైతు కూలీల మాదిరిగా పొలం గట్టుపైనే భోజనం

బాపట్ల, ప్రకాశం కలెక్టర్లిద్దరూ దంపతులు..

అన్నం పెట్టే రైతులను ఆదరించాలని పిలుపు

బాపట్ల, సెప్టెంబరు 25: నిత్యం ఫైళ్లపై పచ్చని సంతకాలు పెట్టే దంపతులైన ఆ కలెక్టర్లు ఇద్దరూ.. తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆదివారం ఆటవిడుపుగా పొలంబాట పట్టారు. రైతులతో కలిసి నాట్లు వేస్తూ వారిలో ఉత్సాహం నింపారు. రైతు కూలీ మాదిరిగా పొలం గట్లపైనే భోజనం చేశారు. బాపట్ల జిల్లా కేంద్రం సమీపంలోని మురుకొండపాడు గ్రామంలో ఆదివారం ఈ ఆసక్తికర  సన్నివేశం ఆవిష్కృతమైంది. ఇందులో ఒకరు బాపట్ల జిల్లా కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ కాగా, మరొకరు ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ఎ.ఎ్‌స.దినే్‌షకుమార్‌. వీరిరువురూ భార్యాభర్తలు. వీరి కుమార్తె కేవ్‌ర్‌ దేవి, కుమారుడు సిద్ధార్థ్‌ ఆత్రేయలతో కలిసి మధ్యాహ్నం వరకు పొలంలో వరినాట్లు వేశారు. అనంతరం పొలం గట్టుపై కూర్చొని బాక్స్‌లో తెచ్చుకున్న భోజనం చేశారు.

కుటుంబ సభ్యులతో కలిసి వరిపొలంలో పనిచేయటం చాలా సంతోషంగా ఉందని వారు ఈ సందర్భంగా చెప్పారు. వ్యవసాయాన్ని ఇష్టపడి చేయాలన్నారు. పది మందికీ అన్నం పెట్టే రైతులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి అన్నిరకాల చర్యలూ తీసుకుంటుందని కలెక్టర్లు ఇరువురూ పేర్కొన్నారు. వ్యవసాయ పనులు చేయటమంటే తమకెంతో ఇష్టమని వారు వెల్లడించారు.  కలెక్టర్లు పొలాలకు రావటంతో కూలీలు, రైతులతోపాటు ఆ గ్రామ ప్రజలు పులకరించిపోయారు.

Read more