అగ్నిపథ్‌పై సుప్రీం కోర్టులో ‘పిల్‌’

ABN , First Publish Date - 2022-07-05T08:26:49+05:30 IST

అగ్నిపథ్‌పై సుప్రీం కోర్టులో ‘పిల్‌’

అగ్నిపథ్‌పై సుప్రీం కోర్టులో ‘పిల్‌’

న్యూఢిల్లీ, జూలై 4: సైన్యంలో భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై వచ్చే వారం విచారణ జరపనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. వేసవి సెలవుల అనంతరం కోర్టులు పునఃప్రారంభమైన తరువాత తగిన ధర్మాసనం ముందు ఈ కేసు ను నమోదు చేస్తారని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ జె.కె.మహేశ్వరిల వెకేషన్‌ బెంచ్‌ పేర్కొంది. న్యాయవాది ఎం.ఎల్‌. శర్మ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కాగా, నేవీ ప్రకటించిన అగ్నివీర్‌ల భర్తీకి 10 వేల మంది మహిళలు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకున్నారు. 3 వేల మంది అగ్నివీరులను నవంబరు 21న ఎంపిక చేసేందుకు ఐఎన్‌ఎ్‌స చిల్కాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Read more