చెరువు ఆక్రమణపై హైకోర్టులో పిల్‌

ABN , First Publish Date - 2022-07-07T09:24:14+05:30 IST

చెరువు ఆక్రమణపై హైకోర్టులో పిల్‌

చెరువు ఆక్రమణపై హైకోర్టులో పిల్‌

ప్రతివాదులకు నోటీసులు జారీ

అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సుబేదార్‌ కుంట చెరువును ఆక్రమించడాన్ని సవాల్‌ చస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, అనంతపురం కలెక్టర్‌, కళ్యాణదుర్గం ఆర్డీవో, తహశీల్దార్‌కు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణల విషయంలో సుమోటోగా నమోదు చేసిన పిల్‌తో ప్రస్తుత వ్యాజ్యాన్ని జతచేయాలని ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. కళ్యాణదుర్గంలోని సుబేదార్‌కుంట చెరువు ఆక్రమణను అడ్డుకోవాలని కోరుతూ కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జి ఎం.ఉమామహేశ్వరనాయుడు హైకోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వై.బాలాజీ వాదనలు వినిపిస్తూ చెరువును పూడ్చి ప్లాట్లుగా వేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వైసీపీకి చెందిన ఓ మంత్రి, అనుచరుల ప్రోద్బలంతో కబ్జా ప్రక్రియ సాగుతోందన్నారు. ఆ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కౌంటర్‌ వేయాలని ప్రతివాదులను ఆదేశించింది.

Read more