Women and Child Welfare Department: ఏవో పోస్టుల నియామకంలో అవకతవకలపై ఏపీ హైకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2022-09-28T17:42:13+05:30 IST

స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ పోస్టుల నియామకంలో అవకతవకలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.

Women and Child Welfare Department: ఏవో పోస్టుల నియామకంలో అవకతవకలపై ఏపీ హైకోర్టులో పిటిషన్

అమరావతి: స్త్రీ శిశు సంక్షేమ శాఖ (Women and Child Welfare Department)లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ పోస్టుల నియామకంలో అవకతవకలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. రేపు ఉదయం ఈ పిటిషన్‌ను విచారించేందుకు ధర్మాసనం అనుమతించింది. ఈనెల 18 పోస్టుల భర్తీ కోసం రాత పరీక్షలు నిర్వహించగా.. 38వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు. కాగా... ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరీక్ష పెట్టకుండానే అధికారులు పంపిచేశారు. ముందుగానే పోస్టుల భర్తీకి మాట్లాడుకొని డబ్బులు వసూలు చేశారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒక్కో పోస్టుకు రూ.10 లక్షలు వసూలు చేశారని ఆరోపించడంతో పాటు, ముందుగా ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేసుకున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. రేపు ఫలితాలు ప్రకటన ఉండటంతో వాటిని నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు.  


Updated Date - 2022-09-28T17:42:13+05:30 IST