తిరుపతిలో గంగమ్మ జాతరకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని హైకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2022-09-28T23:19:52+05:30 IST

తిరుపతిలో గంగమ్మ జాతరకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని తిరుపతికి చెందిన సులోచనమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తిరుపతిలో గంగమ్మ జాతరకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని హైకోర్టులో పిటిషన్

అమరావతి: తిరుపతిలో గంగమ్మ జాతరకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని తిరుపతికి చెందిన సులోచనమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో న్యాయవాది జడ శ్రవణ్కుమార్ వాదనలు వినిపించారు. అధికార పార్టీ నేతలు తమను జాతరకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని శ్రవణ్ వాదనలు వినిపించారు. ప్రాథమిక హక్కులను హరించడం..  సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. సులోచనమ్మ కుటుంబానికి రక్షణ కల్పించి జాతరకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీని హైకోర్టు ఆదేశించింది.

Read more