‘రక్షణ కల్పించండి’

ABN , First Publish Date - 2022-05-20T21:13:48+05:30 IST

‘రక్షణ కల్పించండి’

‘రక్షణ కల్పించండి’

తనకు రక్షణ కల్పించాలని  ఓ వ్యక్తి పోలీసులను కోరాడు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం జాలలపాలెంలో తనకు రెండెకరాల భూమి ఉందని సురభి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తెలిపాడు. అయితే అది అసైన్డ్ ల్యాండ్ అని అధికారులు చదును చేయిస్తుంటే.. హైకోర్టుకు వెళ్లడంతో న్యాయమూర్తి స్టే ఇచ్చారని చెప్పాడు. దీంతో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తనను దుర్భాషలాడారని, జాలల పాలెం సర్పంచ్ కొడుకు రవి బెదిరిస్తున్నాడని, వారితో నాకు  ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2022-05-20T21:13:48+05:30 IST